మిత్‌షాను బర్తరఫ్‌ చేయాలి

సిపిఐ(ఎం) మండల కార్యదర్శి చింతపల్లి బయన్న


జ్ఞాన తెలంగాణ నల్లగొండ జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 30 :
ఈరోజు అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హాంమంత్రి అమిత్‌ షాను బర్తరఫ్‌ చేయాలని సిపిఐ(ఎం) మండల కార్యదర్శి చింతపల్లి బయన్న డిమాండ్‌ చేశారు. సోమవారం నార్కెట్ పల్లి బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత పార్లమెంట్‌ సాక్షిగా అంబేద్కర్‌ను కేంద్ర హౌంమంత్రి అవమానించారన్నారు. అమిత్‌ షా మాటల్లో అహంకారం, మనువాద దృక్కోణం దాగి ఉన్నాయన్నారు. అమిత్‌ షా వెంటనే దేశ ప్రజలకు, పార్లమెంటుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అమిత్‌ షా వాఖ్యలను ప్రధాని ఖండించకపోగా సమర్థించే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని పూర్తిగా రూపుమాపే పద్ధతిలో పనిచేస్తోందని ఆరోపించారు. కార్మికుల పై దళితులపై దాడులు చేస్తున్నారని అన్నారు.దేశంలోయువతకు ఉద్యోగాలు లేక, రైతులకు గిట్టుబాటు ధరల్లేక వేతనాల కోసం కార్మికులు అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్న క్రమంలో అమిత్‌ షా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజా ఉద్యమాలను పక్కదారి పట్టించడం కోసమేనని అన్నారు.పార్లమెంట్‌ సాక్షిగా రాజ్యాంగ నిర్మాతకు అవమానం జరిగిందని అమిత్‌ షా వెంటనే క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఉద్యమం ఉధృతమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అధ్యక్షుడు చెరుకు పెద్దులు, మాజీ వైస్ ఎంపీపీ కల్లూరి యాదగిరి, ఆపార్టీ మండల కమిటీ సభ్యులు ఆమనగంటి ఐలయ్య, దండు రవి, బొల్లెదు సైదులు,కార్మికులు, తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »