వర్గీకరణ హామీని ప్రభుత్వ నిలబెట్టుకోవాలి

వర్గీకరణ హామీని ప్రభుత్వ నిలబెట్టుకోవాలి
- గంధం గట్టయ్య మాదిగ
- వనపర్తి జిల్లా ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల సమన్వయకర్త
జ్ఞాన తెలంగాణ, వనపర్తి జిల్లా ప్రతినిధి,తేది డిసెంబర్ 29 :
వనపర్తి మండలంలోని పెద్దగూడెం గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధన కోసం మాదిగ కుటుంబ సభ్యులు అందరూ కలిసి రావాలని మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మే రకు ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ సాధనమే లక్ష్యంగా ఫిబ్రవరి 3న ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వేదిక నిర్వహించి 1000 గొంతుకలు, లక్ష డప్పులు కార్యక్రమానికి మద్దతుగా ప్రతి ఒక్కరూ నిలవాలని వర్గీకరణ ఫలితాన్ని రాజకీయ పార్టీ వైపు మళ్ళించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని గడిచిన 30 ఏళ్లుగా అన్ని పార్టీలతో కూడగట్టమని అది జాతి ప్రజల కోసమే చేసిందన్నారు.మందకృష్ణ మాదిగ గారు జీవితకాలంలో కండువాలు మారలేదని, భవిష్యత్తులో మారదు కానీ కాంగ్రెస్ పార్టీలో భారత దేశంలో ఎవరికి లేని పలుకుబడి మాలలకు ఉందని ఆ వర్గమే వర్గీకరణ నేటికీ అడ్డంకులు కల్పిస్తూనే ఉన్నారని కానీ అడ్డుకోవడం ఎవరి తరం కాదని ఆ ఫలాలను అందరికీ అందే వరకు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో విశ్రమించమన్నారు వర్గీకరణను అడ్డుకునే వారిపై ధర్మ యుద్ధానికి సిద్ధమవుతామని అందులో భాగంగా కళాకారులను ఏకం చేసి మందకృష్ణ మాదిగ గారు యుద్దానికి సిద్ధమవుతున్నారని గ్రామ గ్రామాలలో ఉన్నటువంటి డబ్బులతో మాదిగలందరూ ఫిబ్రవరి 3న నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే పెద్దగూడెం గ్రామంలో నూతనంగా ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. గజ్జల గోవర్ధన్ మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు సమన్వయపరిచి ఈ యొక్క కమిటీలో అధ్యక్షులుగా చిన్నపాగ శివకుమార్ మాదిగ, ఉపాధ్యక్షులుగా చిన్న మాదిగ, ప్రధాన కార్యదర్శిగా చిన్నపాక శివరాజు మాదిగ, కోశాధికారిగా వడ్డేమాన్ గోవిందు మాదిగ, సోషల్ మీడియా ఇన్ఛార్జి చిన్నపాక రాములు మా, కార్యదర్శులుగా చిన్నపాక రాజు మాదిగ, చిన్నపాక శ్రీను మాదిగ, చిన్నపాగ మాదిగ, చిన్నపాక భగవంతు మాదిగ లను ఎన్నుకోగా ఈ కమిటీలు మాదిగ రక్త బంధువులు,కుటుంబ సభ్యులు, పెద్దలు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.