పరకాలలో అయ్యప్పస్వామి పడిపూజలో పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే జీఎస్సార్

పరకాలలో అయ్యప్పస్వామి పడిపూజలో పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే జీఎస్సార్
జ్ఞాన తెలంగాణ పరకాల పట్టణం డిసెంబర్ 30
పరకాల పట్టణంలోని శ్రీ ధర్మ శాస్త్ర అయ్యప్పస్వామి వారి దేవాలయంలో ఈరోజు ఆదివారం రోజున పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములతో నిర్వహించిన అయ్యప్పస్వామి వారి మహా పడిపూజ మహోత్సవంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు. అనంతరం స్వామి వారి పూజలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేకు అయ్యప్ప స్వాములు, కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈరోజు ఇక్కడ అయ్యప్ప స్వామి వారి మహా పడిపూజలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరిపై అయ్యప్ప స్వామివారి కృప, చల్లని చూపు తప్పక ఉండాలని వేడుకున్నారు. అనంతరం అయ్యప్ప స్వాములు, కాంగ్రెస్ నేతలతో కలిసి అక్కడే స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.