మృతుడి కుటుంబానికి మేఘన్న ఆర్థిక సాయం

మృతుడి కుటుంబానికి మేఘన్న ఆర్థిక సాయం
జ్ఞాన తెలంగాణ, వనపర్తి జిల్లా ప్రతినిధి,తేది :
శ్రీరంగాపురం మండల కేంద్రంకు చెందిన గొల్ల బంకుల్ల ఎల్లస్వామి గారు గత పది రోజుల క్రితం మరణించడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీరంగాపురం మండలం మేఘన్న యువసేన సభ్యులు శ్రీహరి రాజు గౌరవనీయులు శ్రీ తూడి మేఘా రెడ్డి గారి దృష్టికి తీసుకు రాగా… మెగా రెడ్డి గారు తక్షణమే స్పందించి మేఘన్న యువసేన సభ్యులను ఆదేశించగా మృతుడి కుటుంబానికి నిన్న బంకుల్ల ఎల్ల స్వామి గారి దశదినకర్మ సందర్భంగా శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి రాజు మరియు సయ్యద్ వహిద్దిన్ గారి ఆధ్వర్యంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం గంగాధర్ యాదవ్ మరియు మండల సెల్ ప్రధాన కార్యదర్శి జె . అశన్న గార్ల చేతుల మీదుగా రూ.5,000 /- రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీరంగపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి రాజు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏం గంగాధర్ యాదవ్, మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఆశన్న,కాంగ్రెస్స్ యువ తోట రవికుమార్, పసుపు రాజా వర్ధన్, జై రవి మరియు శ్రీహరి మిత్రబృందం తదితరులు పాల్గొన్నారు