పేదల పెన్నిధి జనార్దన్ రెడ్డిని ప్రజలు మరువరు

పేదల పెన్నిధి జనార్దన్ రెడ్డిని ప్రజలు మరువరు
- షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
- ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పి జనార్దన్ రెడ్డి చిత్రపటానికి ఘన నివాళి
జ్ఞాన తెలంగాణ, షాద్నగర్, షాద్నగర్ ప్రతినిధి డిసెంబర్ 27:
గ్రేటర్ రాజకీయాల్లో కార్మిక నాయకుడుగా ఎనలేని సేవలు అందించి పేదల పెన్నిధిగా కార్మికులకు అండగా పక్కా హైదరాబాదీగా మాజీ మంత్రి, కాంగ్రెస్ వాది పి. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అభివర్ణించారు. పి జనార్ధన్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రమటానికి కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్మికనాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టి ఖైరతాబాద్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని పలు శాఖలకు మంత్రిగా పనిచేశారన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన పీజేఆర్ దేనని, ఒంటి చేత్తో హైదరాబాద్, రాష్ట్ర రాజకీయాలను శాసించారన్నారు. అటువంటి మాస్ లీడర్ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని ఆయన సేవలను కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉన్నంతకాలం గుర్తుపెట్టుకుంటుందని అన్నారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కే చెన్నయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ నివాళి కార్యక్రమానికి మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, కృష్ణారెడ్డి, స్థానిక నాయకులు వెంకట రామిరెడ్డి, దమ్ము శ్రీనివాస్ యాదవ్ మసూద్ ఖాన్, అగనూరు బస్వం, అంబటి ప్రభాకర్, చంద్రశేఖర్, సత్తయ్య, అనిల్, యాదగిరి యాదవ్, శ్రీను నాయక్, సురేష్ గౌడ్, లింగారెడ్డి గూడా అశోక్ తదితరులు పాల్గొన్నారు.