వీళ్ళకా మనం ఓట్లు వేసి గెలిపించింది

పసుపుల ప్రశాంత్ ముదిరాజ్ బీసీ సేన రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు


  • అసెంబ్లీ లో పేద ప్రజల పై చర్చనే లేదు
  • మెజారిటీ ప్రజల బాగుకై ఆలోచనే లేదు
  • మనం ఎందుకొచ్చాము ఏం జేస్తున్నాం అన్న ఆలోచనే లేదు
  • ఇప్పటికైనా మిమ్మల్ని గెలిపించి అసెంబ్లీ కి పంపించిన ప్రజలను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళండి
  • రానున్న లోకల్ బాడీ ఎలక్షన్ లో మీ జాతకాలు తారు మారు కాకుండా చూసుకోండి
  • పసుపుల ప్రశాంత్ ముదిరాజ్ బీసీ సేన రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు

అసెంబ్లీ అంటే ఈ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల జనాభా తలరాతలను మార్చే దేవాలయంలా భావిస్తాం కానీ అసలు అక్కడ ఏం జరుగుతుంది టీవీ ల ముందు కూర్చుని చూస్తుంటే వీళ్లనా మనం నమ్మి మనకేదో చేస్తారని ఓట్లు వేసి గెలిపించి అసెంబ్లీ పంపింది అని ప్రజలు సిగ్గుపడుతున్నారు.ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల బాగోకులు ఎలా మార్చాలి మెజారిటీ ప్రజల జీవితాలు ఏమైతున్నాయి అని అంతఃకరణ శుద్ధితో ఆలోచించే ఎమ్మెల్యే లు కరువై పోయారు మల్లారెడ్డి రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటాడు ఆయనైతే అసెంబ్లీ ని జబర్దస్త్ స్టేడి లెక్క మార్చే ప్రయత్నం చేస్తుంటాడు.అసెంబ్లీ లో ఆయన ఎప్పడు మాట్లాడిన సొంత బిజినెస్ బాగోగుల పై మాట్లాడినట్టే ఉంటది తప్ప ఏ రోజు నియోజక వర్గ ప్రజల తరుపున మాట్లాడినట్టు అస్సలు ఉండదు ఇంకో ఆయన 4 కోట్ల జనాభా ని పక్కన పెట్టి రాష్ట్రం లో అసలేం సమస్యలే లేనట్టు అల్లు అర్జున్ టాపిక్ మాట్లాడుతాడు ఇంకో ఆయన భూతులు మాట్లాడుతాడు ఇలా చెప్పుకుంటే పోతే కుప్పలు కుప్పలు ఉన్నాయి ఇందులో ఒకటన్న పేద ప్రజల తలరాతలు మార్చే దారి కనిపిస్తుందా ఇవి వినటానికా మనం వీళ్లని గెలిపించి అసెంబ్లీ కి పంపించింది సమయమంతా కొట్లాటలకు ఒకరిని ఒకరు తిట్టుకోవటానికే సరిపోతుంది వీధి రౌడీల్లా ప్రవర్తిస్తూ స్పీకర్ మీదకి దూసుకు పోతున్నారు అసెంబ్లీ లో అసలు ఏం జరుగుతుంది సిగ్గు పడుతున్నారు ప్రజలు మిమ్మల్ని చూస్తు కాస్త ఆలోచించండి మనం ఎందుకొచ్చాము ఏం చేస్తున్నాం ఇక్కడని కోట్లాది జనం మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు పూర్తిగా వాళ్ళ ఆశలను వొమ్ము చెయ్యకండి. ప్రజలు ఆర్థిక సంక్షోభం వొచ్చి కొట్టు మిట్టాడు తిన్నారు ఇప్పటికైనా మారి కాస్త మిమ్మల్ని అసెంబ్లీ కి పంపిన ప్రజల గురించి ఆలోచించండి లేదంటే లోకల్ బాడీ ఎలక్షన్ పక్కా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు జాగ్రత్త…..

You may also like...

Translate »