మార్షల్ ఆర్ట్స్ లో సత్తా చాటిన శంషాబాద్ విద్యార్థులు

మార్షల్ ఆర్ట్స్ లో సత్తా చాటిన శంషాబాద్ విద్యార్థులు
బి ఎన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో , తెలంగాణ పదవ ఛాంపియన్షిప్ కైవసం, విద్యార్థులను అభినందించిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ , సత్తా చాటిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్ మేకల వెంకటేష్ ముదిరాజ్
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,డిసెంబర్ 17:
విద్య మనిషిని వివేకవంతుని చేస్తే మార్షల్ ఆర్ట్స్ లాంటి యుద్ధ విద్యలు పిల్లలను శారీరకంగా మానసికంగా దృఢత్వాన్ని ఇస్తాయి అని నిర్వాహకులు తెలిపారు.రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజక వర్గం శంషాబాద్ పట్టణానికి చెందిన బి ఎన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు 2024 తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్ పోటీలలో గెలుపొంది చాంపియన్ షిప్ ను కైవసం చేసుకున్నారు. కరాటే మాస్టర్ భగవాన్ దాస్ నాయక్ ఆధ్వర్యంలో కొన్ని నెలలుగా శిక్షణ పొందిన విద్యార్థులు జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచి ఉత్తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. కరాటే పోటీలో చంపియన్ షిప్ కైవసం చేసుకున్న విద్యార్థులను శంషాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ మేకల వెంకటేష్ ముదిరాజ్ ప్రత్యేకంగా అభినందించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శాలువాలతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో పిల్లల్లో ఆత్మన్యూన్యత ప్రభావంతో భయపడుతూ ఉంటారు. ఇలాంటి పిల్లలకు మార్షల్ ఆర్ట్స్, కరాటే లాంటి యుద్ధ విద్యల్లో శిక్షణ ఇచ్చినట్లయితే బయటి ప్రపంచంలో తమను తాము కాపాడుకోవడానికి ఈ యుద్ధ విద్యలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. ముఖ్యంగా పురుషులే కాకుండా ఆడపిల్లలకు కూడా ఇలాంటి శిక్షణను ఇచ్చినట్లయితే. వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి మానసికంగా శారీరకంగా దృఢంగా తయారవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల్లో మెడల్ సాధించిన విద్యార్థులు పాల్గొని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆశీస్సులు తీసుకున్నారు మెడల్స్ సాధించిన విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులు బొమ్మ అవినాష్ గౌడ్, వర్షిత, కార్తికేయ, అభిలాష్, డైసీ, బ్రౌన్ మెడల్ సాధించిన విద్యార్థులు పరిణిత, హిత్వి, అక్షిత, యశస్విని, శ్రీకర్ యాదవ్, సర్వేశ్ సాయి,రిశాంత్, చక్రధర్, అక్బర్, ఆరాధ్య, కీర్తన, దీక్షిత యాదవ్, మాన్విత రెడ్డి, విహాన్ క్రిష్, ప్రతీక్, భావేష్, రిషికేష్, అలకనంద, అభి నాథ్, దేవాన్ష్, నాగసాయి విధున్, హరిదీపు, సాయి తేజ, చరణ్, ప్రణవ్, సాత్విక్ విద్యార్థులు సత్తా చాటి ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకున్నారు
