కందవాడ గ్రామంలో రెపరెపలాడిన ఎర్రజెండా

కందవాడ గ్రామంలో రెపరెపలాడిన ఎర్రజెండా
- సిపిఐ 100 వసంతాలు పూర్తి చేసుకోవడం కమ్యూనిస్టుల గొప్పతనం సిపిఐ
- జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య
జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా, డిసెంబర్ 17:చేవెళ్ల మండలంకందవాడ గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100 సంవత్సరాల లోకి అడుగుపెడుతున్న సందర్భంగా సిపిఐ పార్టీ సభ్యత్వాన్ని పెంచి కమ్యూనిస్టుల గొప్పతనాన్ని చాటాలని సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పిలుపునిచ్చారుఈరోజు కందవాడ గ్రామంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో సిపిఐ కార్యక్రమాన్ని ప్రారంభించారు,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య హాజరై సిపిఐ జండాను ఎగురవేసి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న భారతదేశంలోని కాన్పూర్ పట్టణంలో ఆవిర్భవించిన సిపిఐ పార్టీ 2024 డిసెంబర్ 26 నాటికి 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100 సంవత్సరాల లలోకి అడుగుపెట్టడం కమ్యూనిస్టుల గొప్పతనాన్ని చాటుకుంటుందని ఆయన అన్నారు.
దేశంలో 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం సిపిఐ పార్టీ అని ఆయన కొనియాడారు 99 సంవత్సరాలుగా ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు.అధికారంలో ఉన్న లేకపోయినా నిరంతరం పేదల పక్షాన పోరాడే కమ్యూనిస్టు పార్టీని ప్రజలు ఆదరించి కమ్యూనిస్టు పార్టీని అభివృద్ధి చేసుకోవలసిన బాధ్యత ప్రజలకి ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి, బి కే ఎం యు జిల్లా అధ్యక్షుడు జే అంజయ్య,చేవెళ్ల మండల సిపిఐ కార్యదర్శి ఎం సత్తిరెడ్డి, మొయినాబాద్ మండల పార్టీ కార్యదర్శి కే శ్రీనివాస్,పార్టీ సీనియర్ నాయకులు వెంకటయ్య మహిళా సమైక్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల,ఆశా వర్కర్లు పద్మ,మీనాక్షి,కందవాడ గ్రామ కార్యదర్శి బండ ఎలీషా,సహాయ కార్యదర్శి ఎర్ర బీరప్ప,ఎర్ర యాదయ్య,ఎర్ర గోపాల్,రాయిని యాదమ్మ,పద్మ సత్తయ్య,పెంటయ్య,కారుకొండ యాదమ్మ,కారుకొండ సత్తయ్య సుధాకర్,గౌడ్, బ్యాగరి బుచ్చయ్య,బ్యాగరి రామచంద్రయ్య,లలిత,వెంకటమ్మ,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు
