బోధనేతర పనులు ఉపాధ్యాయులకు అప్పగించొద్దు

జామ కుశాల్ ప్రధాన కార్యదర్శి

తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ TRTF రంగారెడ్డి జిల్లా


  • జిల్లా అధ్యక్షులు కొమ్ము లోకేశ్వర్ ప్రధాన కార్యదర్శి జామ కుశాల్

బోధనా అభ్యసన ప్రక్రియ విజయవంతం కావాలంటే బోధనేతర పనులు ఉపాధ్యాయు లకు అప్పగించకూడదని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టిఆర్టిఎఫ్)రంగారెడ్డి జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి ప్రభు త్వాన్ని కోరారు. ప్రతిరోజు ఉపాధ్యాయులు అనేక రికార్డులు రిపోర్టులు(ఆన్లైన్ ఆఫ్ లైన్), పంపించడం, బోధనేతర కార్యక్రమాలు పాఠశాలల్లో నిర్వహించడం లాంటి వాటితో పాటు మధ్యాహ్నం భోజన పథకం అమలు చేయడంలో నిమగ్నమవడం వల్ల బోధనా ప్రక్రియ కుంటుపడుతుం దని విచారం వ్యక్తం చేస్తున్నామని, ముఖ్యంగా సరిపోని డబ్బులతో అరకొర వసతులతో స్థానిక పరి స్థితులతో రాజకీయ జోక్యంతో నిధుల విడు దల జాప్యంతో మధ్యాహ్న భోజన పథకం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడు తున్నదని ఇలా ఉపాధ్యాయ విధులతో బోధనకు సం బంధం లేని అనేక అంశాలతో ఉపాధ్యాయు లను ముడిపెట్టి విద్యావ్యవస్థను విద్యారం గాన్ని సంక్షోభంలోకి నెట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తూ బోధనేతర కార్యక్రమా లకు ఉపాధ్యాయులను దూరంగా ఉంచాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు.

You may also like...

Translate »