అభివృద్ధిని అడ్డుకోవద్దు : సబితా ఇంద్రారెడ్డి

అభివృద్ధి పనులను పరిశీలించిన సబితా ఇంద్రారెడ్డి
అభివృద్ధిని అడ్డుకోవద్దు : సబితా ఇంద్రారెడ్డి
- చెరువు కట్ట పైన జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన
- మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
జ్ఞాన తెలంగాణ,మహేశ్వరం, అక్టోబర్ 24 :మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధి రావిర్యాల పెద్ద చెరువు కట్ట పైన జరుగుతున్న అభివృద్ధి పనులను మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు.ఈ సందర్బంగా
ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాం లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేసినటువంటి నిధుల్లో భాగంగా అన్ని చెరువులను సుందరీ కరణ నిధులు మంజూరు చేయడం జరిగిందని అట్టి నిధులను అడ్డుకోవడం వల్ల నేడు అన్ని పనులు కూడా నిరంతరాయంగా మిగిలిపోయాయని అంతేకాకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం మంజూరైన నిధులు కూడా అడ్డుకోవడం వల్ల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని మౌలిక సదుపాయాలు దృష్టిలో పెట్టుకొని ఆనాటి ముఖ్యమంత్రి మంజూరు చేస్తే ఈనాడు ముఖ్య మంత్రి అన్నీ కూడా ఆ నిధులు అడ్డుకోవడం జరిగిందని దయచేసి ఇప్పుడైనా ఆనాడు మంజూరైన నిధులు తక్షణమే మంజూరు చేయాలని, అభివృద్ధిని అడ్డుకోవద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ సర్కార్ని హెచ్చరించారు. తుక్కుగూడ మున్సిపాలిటీలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు.ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపల్ అధ్యక్షుడు జిల్లల లక్ష్మయ్య, యూత్ అధ్యక్షుడు సామెల్ రాజు, కౌన్సిలర్ రవి నాయక్, బంటు రమేష్, చంద్రశేఖర్ రెడ్డి నాయకులు ప్రజాప్రతినిధులు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.
