మళ్లీ మొదలైంది మొరం దందా

చిట్యాల లో పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు


మళ్లీ మొదలైంది మొరం దందా

  • సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలంటే డిమాండ్
  • లేనిపక్షంలో ప్రజాసంఘాలతో ఏకమై ఆందోళన
  • కార్యక్రమాలను నిర్వహిస్తామని హెచ్చరిక
  • సిపిఐ ఎం లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్

జ్ఞానతెలంగాణ,చిట్యాల,అక్టోబరు24 :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని కైలాపూర్ గ్రామపంచాయతీ శివారులోని శాంతినగర్ గుట్టల్లో అక్రమ మొరం దందా మళ్ళీ మొదలైందని సంబంధిత రెవిన్యూ మైనింగ్ అధికారులు పట్టించుకోవడంలేదని గత కొన్ని నెలల క్రితం అక్రమార్కులు జెసిబి, ట్రాక్టర్లతో అక్రమంగా మొరం ఐరన్ఓర్ ను తరలించారని,ఇప్పుడు మళ్లీ గత మూడురోజుల నుండి అదే దందా ను సంబంధిత అధికారుల అండదండలతో యతేచ్చగా జరుపుతున్నారని ఆరోపించారు. ఇట్టి విషయంలో జిల్లా కలెక్టర్ సంబంధిత రెవెన్యూ మైనింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుస్తున్నాం అన్నారు. శాంతినగర్ గుట్టలోని టేకులబోడు గుట్టను అక్రమార్కులు మొరం దందాతో దాన్ని పూర్తిగా అంతం చేశారని అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతోనే ఈ తతంగం మొత్తం జరుగుతుందని చిట్యాల,టేకుమట్ల రెండు మండలాల అధికార పార్టీ నాయకుల అండదండలతోనే అక్రమ మొరం దందా జరుగుతుందని. ప్రభుత్వాలు మారిన అదే అక్రమ దందా కొనసాగుతూ ఖనిజ సంపదను సహజ వనరులను దోచుకోవడం ఆగడం లేదన్నారు.శాంతినగర్ గుట్టలకు సంబంధించిన 172 ఎకరాల భూమిని అక్రమంగా కొంతమంది పట్టా చేసుకొని గుట్టలు మావే అంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని గుట్టలు ప్రజా సంపద కాబట్టి గుట్టలను ప్రభుత్వాలు కాపాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
అక్రమంగా తరలిపోతున్న మొరం దందాను ఆపాలని జిల్లా అధికార యంత్రాంగం స్పందించి శాంతినగర్ గుట్టలను కాపాడాలని కోరుతున్నాం. లేనిపక్షంలో అన్ని ప్రజా సంఘాలతో ఏకమై ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.


సిపిఐ ఎం లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్

You may also like...

Translate »