5 డి ఏ లను వెంటనే విడుదల చేయాలి : తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్

తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జామ కుషాల్
– కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులను సన్మానించిన తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్
జ్ఞాన తెలంగాణ,చౌదరి గూడ :
ఈ రోజు చౌదరి గూడ మండలం లోని గుర్రంపల్లి ఇందిరానగర్ తుంపల్లి ప్రాథమిక పాఠశాల కి కొత్తగా 2024 DSC లో వచ్చిన ఉపాధ్యాయులను TRTF తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జామ కుషాల్ గారు వారి యొక్క పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయ వృత్తి గురుంచి వివరించి సంఘం పక్షాన సన్మానం చేసి అభినందనలు తెలియ జేయడం జరిగింది. అదే విదంగా TRTF సంఘం అవష్యాకత తెలియచేసి సంఘ సభ్యత్వం చేయించడం జరిగింది. ఈ సందర్బంగా జామ కుషాల్ మాట్లాడు తు ఈ నెల 26 న జరుగు మంత్రి వర్గ సమావేశం లో ఉపాధ్యాయులకు రావలసిన 5 DA లను విడుదల చేయాలనీ ప్రభుత్వం ను కోరడం జరిగింది అలాగే పెండింగ్ లో ఉన్న మెడికల్ బిల్స్ సరెండర్ బిల్స్ మొదలగునవి వెంటనే విడుదల చేయాలని కోరడం జరిగింది. అలాగే 40% ఫిట్మెంట్ తో PRC ని ఇవ్వాలని కోరడం జరిగింది

