తప్పులు మీవి శిక్షలు మాకా ….?

తప్పులు మీవి శిక్షలు మాకా ….?


  • ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం కొన్న ప్లాట్లు వ్యవసాయ భూములుగా ధరణి పోర్టల్ లో దర్శనం
  • జీ ఓ 111 కంటే ముందుకొన్న పాట్లు కూడా వ్యవసాయ భూముల జాబితాలో..
  • రికార్డ్ లు సరిచుకోడం లో రెవెన్యూ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం
  • లబో దిబోమంటున్న పాట్ల యజమానులు
  • ధరణి పాసు పుస్తకాలను రద్దుచేసి తిరిగి యధావిధిగా ప్లాట్లుగా మార్చాలని వేడుకోలు

జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి : రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో ప్లాట్ల యజమానులు లబో దిబో మంటున్నారు.. వివిధ ప్రైవేట్ కంపెనీలలో ఎన్నో సంవత్సరాల పాటు శ్రమించి దాచుకున్న డబ్బులతో, సుమారు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన ప్లాట్లను ప్రస్తుతం వ్యవసాయ భూములుగా ధరణిలో చూపిస్తుండడంతో ప్లాట్ల యజమానులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ, కోర్టుల చుట్టూ, ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రెవెన్యూ అధికారులు ప్లాట్లుగా మారిన భూములను, రెవెన్యూ రికార్డులలో తొలగించకపోవడంతో వ్యవసాయ భూములుగానే మిగిలి పోయాయి. రెవెన్యూ అధికారులు నిర్లక్ష్య వైఖరి తో వందల మంది ప్లాట్ల యజమానులు లబోదిబోమంటున్నారు. ప్లాట్లుగా మారిన వ్యవసాయ భూములకు సంబంధించిన ధరణి పాసు పుస్తకాలను రద్దు చేసి,ప్లాట్లుగా నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వివరాలలోకి వెళితే రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని బుల్కాపురం రెవెన్యూ పరిధి, సర్వేనెంబర్ 80,81మరియు 85 లో సుమారు 17 ఎకరాలలో 1990 సంవత్సరంలో గ్రామ పంచాయతీ అనుమతితో లేఔట్ చేశారు.సొంత ఇల్లు ఉండాలని ఆశతో శ్రీకాకులం, గంటూరు, విజయవాడ ఇలా సుదూర ప్రాంతాలకు చెందిన ఎంతో మంది ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేశారు. నాటి నుండి ఆ ప్లాట్లు యజమానుల ఆధీనంలోనే ఉండేవి.గత కొంత కాలంగా వారు ఇక్కడ నివసించకపోవడంతో లేఔట్ గా ఉన్న భూమిని వ్యవసాయ భూములుగా మార్చారు. స్థిరాస్తి వ్యాపారం శంకర్ పల్లిలో ఊపందుకోవడంతో ప్లాట్ల యజమానులు స్వంత ఇంటిని నిర్మించుకునేందుకు ప్లాట్ల వద్దకు రాగా,వారికి ప్రహరీ గోడలు దర్శనమిచ్చాయి. లోపలికి వెళ్లి వాళ్లు ప్లాట్లు చూసుకునేందుకు ప్రయత్నించగా,వారిపై తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ లేఔట్ లోని ప్లాట్ల లావాదేవీలు 111 జీఓ రాక ముందే జరగడం విశేషం

రైతుబంధుతో ప్రభుత్వ ఖజానాకు గండి :

శంకర్ పల్లిలో స్థిరాస్తి వ్యాపారం ఊపందుకోవడంతో లేఔట్లకు భూములు విక్రయించిన రైతులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై విక్రయించిన భూమికే పట్టాదార్ పాస్ బుక్ పుస్తకాలను తిరిగి పొందారు. ఇటీవల వ్యాపారం ఊపందుకోవడంతో ధరణి పాస్ పుస్తకాలు కలిగిన భూ యజమానులు స్థిరాస్తి వ్యాపారులకు విక్రయించారు. ఇప్పటికే ముగ్గురు,నలుగురు చేతులు మారాయి.కెసిఆర్ ప్రభుత్వం పాసు పుస్తకాలు కలిగిన యజమానులకు రైతుబంధు అమలు చేయడంతో వారికి రైతుబందు డబ్బులు కూడా వారి ఖాతాలో జమయ్యాయి.దీనితో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది

అక్రమంగా ప్రహరీగోడల నిర్మాణం :

అక్రమ మార్గంలో పాస్ పుస్తకాలు పొందిన స్థిరాస్తి వ్యాపారులు దర్జాగా ప్రహరీలు నిర్మించుకునే పనిలో ఉన్నారు. ప్లాట్ల యజమానులు వారికి సంబంధించిన ప్లాట్లల్లోకి రానివ్వకుండ బెదిరింపులకు గురి చేస్తున్నారని, ప్లాట్ల యజమానులలు తలలు పట్టుకుంటున్నారు..ఇట్టి విషయం గురించి ప్లాట్ల యజమానులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడలను తీసివేయాలని, మన్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. పాసు పుస్తకాలు కలిగిన స్థిరాస్తి వ్యాపారులు లేఔట్ అయిన విషయాన్ని దాచి వ్యవసాయ భూమిగా సర్వే చేయాలంటూ రాజకీయ నాయకులు,ఉన్నతాధికారుల, తో సర్వే అధికారులపై వత్తిడి తెస్తున్నారు. ప్లాట్ల యజమానులు వ్యవసాయ భూమిగా సర్వే చేయడానికి ఒప్పుకోవడం లేదు. దీంతో ప్లాట్ల యజమానులకు అక్రమ భూ యజమాన తరచూ వాగ్వివాదం జరుగుతుంది.ఈ విషయంలో రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి తగిన విధంగా చర్యలు తీదుకోవాలని ప్లాట్ల యజమానులు కోరుకుంటున్నారు.

You may also like...

Translate »