లిటిల్ బర్డ్స్ లో స్టూడెంట్ బర్త్ డే

లిటిల్ బర్డ్స్ లో స్టూడెంట్ బర్త్ డే

  • స్పెషల్ ఎట్రాక్షన్ గా ఫొటో చాక్లెట్

జ్ఞాన తెలంగాణ న్యూస్ భద్రాద్రి/ అశ్వారావుపేట న్యూస్ , ఆగష్టు 21: అశ్వారావుపేట మండలం, వినాయకపురం లిటిల్ బర్డ్స్ పాఠశాలలో సోమవారం యూకేజీ విద్యార్థి చిన్నారి బాలిన సాహిత్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు మేనమామ అయినా గెడ్డం సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పెద్దమ్మ మామిడి వెంకటమహాలక్ష్మి, పాఠశాల ప్రిన్సిపాల్ ధనరాజు, ఉపాధ్యాయుల తో కలిసి బర్త్ డే కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మేనమామ గడ్డం సతీష్ మేనల్లుడు బాలిన సాహిత్ గౌడ్ ఫోటోతో ప్రత్యేకంగా తయారు చేయించిన కష్టమైసేడ్ చాక్లెట్లను విద్యార్థులకు పంచారు. ఈ చాక్లెట్లు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన విద్యార్ధులకు టీచర్స్ కు సాహిత్ అభినందనలు చెప్పారు. తమ విద్యార్థుల మధ్యన జన్మదిన వేడుకలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమం లో..వేంకట లక్ష్మి, కొప్పుల శ్రీకాంత్ నాగలక్ష్మి, సాయి లక్ష్మి, తనియ, బట్టు, ప్రియాంక, మౌనిక, స్వప్న, రాములమ్మ, శిరీష, జానకి, లత పాల్గొన్నారు.

You may also like...

Translate »