భుక్తికోసం జీవన పోరాటం

భుక్తికోసం జీవన పోరాటం
- చిన్నారులతో ప్రమాదకర విన్యాసాలు
- పోడవాటి కర్రపై చిన్నారిని పడుకోబెట్టి పైకి లేపిన దృశ్యం.
జ్ఞాన తెలంగాణ – బోధన్ :
భుక్తికోసం ఊరుగాని ఊరికి వచ్చిన నిరుపేద సర్కస్ కళాకారులు గ్రామాలలో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ దాతలు ఇచ్చిన దానితో జీవనం గడుపుతు వారి విద్యను ప్రదర్శిస్తున్నారు.గత రెండు రోజులుగా సాలూర మండల కేంద్రంలో సర్కస్ విన్యాసాలతో ప్రజలను అలరిస్తున్నారు. మట్టిలో నుంచి సూదిని కంటితో తీయడం, నాగలిని పంటితో పైకి లేపడం, ఇరువైపుల కర్రలకు తాడుకట్టి దానిపై విన్యాసాలు చేయడం చేశారు.అలాగే పొడుగటి కర్రపై చిన్నారిని పడుకోబెట్టి నోటితో పైకి లేపిన విన్యాసం ఒళ్లు గగుర్పొడిచేలా అనిపించింది.వీరి విన్యాసాలకు ముగ్దులైన మానవతావాదులు తోచినకాడికి ఆర్థిక సహాయ చేశారు.
