సాలూర మండల వ్యవసాయ శాఖ అధికారిగా కెతావత్ శ్వేత

సాలూర మండల వ్యవసాయ శాఖ అధికారిగా కెతావత్ శ్వేత

జ్ఞాన తెలంగాణ – బోధన్ : నూతనంగా ఏర్పాటుచేసిన మండలాలకు ప్రభుత్వం ఎట్టకేలకు మండల స్థాయి అధికారుల నియామకాలను చేపట్టింది.గత నెల క్రితం మండల విద్యాశాఖ అధికారుల నియామకం చేపట్టిన ప్రభుత్వం ప్రస్తుతం మండల వ్యవసాయ శాఖ అధికారుల నియామకాలను చేపట్టింది.అందులో భాగంగా సాలూర మండలానికి కెతావత్ శ్వేతను మండల వ్యవసాయ శాఖ అధికారిగా నియమించింది. కెతావత్ శ్వేత నిజామాబాద్ లో ఏఈఓగా పని చేశారు.అనంతరం వ్యవసాయ శాఖ అధికారుల నియామకాలకై నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఆమే ఉత్తీర్ణత సాధించడంతో ప్రభుత్వం ఆమేను సాలూర మండల తొలి వ్యవసాయ శాఖ అధికారిగా బాధ్యతలు అప్పగించింది.

You may also like...

Translate »