గాలికుంటు వ్యాధులు సోకకుండా పశువులకు టీకాలు

గాలికుంటు వ్యాధులు సోకకుండా పశువులకు టీకాలు

  • పశు వైద్యాధికారి డాక్టర్ రాకేష్

జ్ఞాన తెలంగాణ, మొగుళ్లపల్లి(అక్టోబర్ 17) :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం గణేష్ పల్లి గ్రామంలో జిల్లా పశు వైద్య శాఖ, పశు సంవర్ధక శాఖల ఆధ్వర్యంలో 42 ఆవులు ఎద్దులు, 20 గేదెలకు గాలికుంటు వ్యాధులు సోకకుండా ఉచితంగా టీకాలు వేసి, పశువులకు ఇతర వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాడి రైతులకు అవగాహన కల్పించినట్లు మొగుళ్ళపల్లి మండల పశు వైద్యాధికారి డాక్టర్ రాకేష్ తెలిపారు. అనంతరం ఆయన పాడి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని నెలరోజులపాటు కొనసాగిస్తామని, కావున మండలంలోని పశువులు ఉన్న పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర శ్రీనివాస్, ఓ ఎస్ తిరుపతి, పాడి రైతులు, తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »