పిప్పరవాడ లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

పిప్పరవాడ లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు జ్ఞానతెలంగాణ,జైనథ్,అక్టోబర్ 17 : జైనథ్ మండలంలోని పిప్పర్ వాడ గ్రామంలో వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పిప్పర్ వాడ మరాఠి శివ గంగపుత్ర సంఘ సభ్యులు అందరూ కలిసి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇందుమూలంగా గ్రామస్తులు గంగ పుత్రులు అందరూ కలిసి వాల్మీకి మహర్షి పూజ జయంతి కార్యక్రమాలు చేసి అక్కడి నుండి ఊరిలో ఉన్న ప్రతి ఒక్క టెంపుల్ కి వెళ్లి అంటే రామాలయం, ఆంజనేయస్వామి మందిరము, పోచమ్మ తల్లి ఆలయము, మహాశివుడు మహాదేవుని ఆలయము, అక్కడి నుండి సమీపంలోని నదిలో వెళ్లి నైవేద్యాలు సమర్పించి పూజలు చేయడం జరిగింది ఇందులో మహిళలు, పెద్దలు ,యువకులు ,అధిక సంఖ్యలో వచ్చి, జయంతి వేడుకలను విజయవంతం చేశారు ఇంత గొప్ప ఆది కవి అని పిలువబడే వాల్మీకి మహర్షి ఒక బోయవాడు కావడం మా సంఘానికి చాలా గర్వంగా ఉంది ఆయన మొదటగా రామాయణాన్ని రచించి ఇప్పటికీ చిరస్థాయిలో నిలిచిన మహా జ్ఞానవంతుడు మహాకవిగా పిలువబడతాడు ఇలా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క గ్రామంలో ఆధ్యాత్మిక చింతనతో వాల్మీకి గారి చరిత్రను తెలుసుకొని అతని జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవాలని మా గ్రామం నుంచి అందరికీ కోరుతున్నాము ఆయన రామాయణం రాయడం వలన మనకు రామాయణంలో ఏం జరిగిందో అతని ద్వారా తెలుసుకోనగలిగినము అని గంగ పుత్ర సంఘం సభ్యులు కొనియాడారు.
