వైరా మండలం కెజి సిరిపురం నుంచి ఎస్జిటి ఉద్యోగాలు పొందిన కొత్తపల్లి శివప్రసాద్, ఇనుపనురి ఉపేందర్

వైరా మండలం కెజి సిరిపురం నుంచి ఎస్జిటి ఉద్యోగాలు పొందిన కొత్తపల్లి శివప్రసాద్, ఇనుపనురి ఉపేందర్

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 8:

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ ఫలితాలలో
ఖమ్మం జిల్లా,వైరా మండలం సిరిపురం కెజి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు “కొత్తపల్లి శివప్రసాద్ ,ఇనపనూరి ఉపెందర్ సెకండ్ గ్రేడ్ టీచర్ ఉద్యోగాలు పొందినారు.నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఇద్దరు అనేక ఒడిదుడుకులు కష్టాలు ఎదుర్కొని కష్టపడి చదువుకొని ప్రభుత్వం ఉద్యోగం పొంది ఖమ్మం జిల్లాలోనే పోస్టింగ్ పొందడం జరిగింది
వారికి నియమక పత్రాలు జిల్లా విద్యాశాఖ అధికారి అందజేయటం జరిగింది…సిరిపురం కేజీ గ్రామం నుండి విద్యాభ్యాసం కొనసాగించి నేడు ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన శివప్రసాద్, ఉపేంద్రను వృత్తి పరంగా మరిఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు గ్రామ ప్రజలు అభినందించారు…

You may also like...

Translate »