హర్యానా ఎన్నికల ఫలితాల్లో విడ్డూరం

హర్యానా ఎన్నికల ఫలితాల్లో విడ్డూరం
- ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకు సీట్లు తగ్గాయ్..
- కానీ ఓట్లు పెరిగాయి
హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. సీట్ల ఆధిక్యంలో వెనుకబడిన కాంగ్రెస్ ఓట్ల శాతంలో మాత్రం ముందుంది. ఈసీ వెబ్సైట్ ప్రకారం మధ్యాహ్నం 12.15 గంటల సమయానికి కాంగ్రెస్ 40.25 శాతం, బీజేపీ 39.29 శాతం ఓట్లను సాధించాయి. అయితే బీజేపీ 49 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 35 స్థానాలకే పరిమితమైంది. ఫలితాలు ఇదే తరహాలో కొనసాగితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బీజేపీ తారుమారు చేస్తూ హర్యానాలో హ్యాట్రిక్ విజయం సాధించి ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడం జరుగుతుంది.