మహాలింగాపురం శివాజీ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం

మహాలింగాపురం శివాజీ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం

  • ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళ అసెంబ్లీ ఇంచార్జీ పామేన భీమ్ భరత్
  • భారీ సెట్టాప్ లో గణపతి మండపం
  • ప్రత్యేక పూజలో పాల్గొన్న యూత్ సభ్యుల కుటుంబాలు
  • ప్రత్యేక ఆకర్షణ గా శివాజీ సేన యూత్ సభ్యులు
  • విజయవంతం గా అన్నదాన కార్యక్రమం
  • కార్యక్రమం లో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీల నాయకులు యువజన సంఘాల నాయకులు, ప్రజలు

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి:
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామంలో శివాజీ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పామేన భీమ్ భరత్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.గజనాధుడు గ్రామం లోని ప్రజలందరినీ సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని కోరారు.
శివాజీ సేన యూత్ సభ్యులు వారి వారి కుటుంబాలతో ప్రత్యేక పూజలో పాల్గొని గజనాధుడికి తీర్థ ప్రసాదాలను సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాన రోడ్డు మార్గంలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న గజనాధుడు మండపాన్ని చూసి చాలామంది సంతోషించారు. గజనాధుడు ని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మధ్యాహ్నం నుండి రాత్రి వరకు నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు శివాజీ సేన యూత్ సభ్యులు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన శివాజీ సేన యూత్ అసోసియేషన్ సభ్యులను పలువురు అభినందించారు.

ప్రత్యేక పూజలో పాల్గొన్న శివాజీ సేన యూత్ అసోసియేషన్

భారీ మండపం ముందు శివాజీ సేన యూత్ అసోసియేషన్

You may also like...

Translate »