భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

జ్ఞాన తెలంగాణా అలంపూర్ సెప్టెంబర్ 14:
ఈరోజు అలంపూర్ పట్టణంలో హరిత హోటల్లో పట్టణ అధ్యక్షులు నాగమద్దిలేటి గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారు విచ్చేశారు వారు ముఖ్యఅతిథి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈనెల 2వ తేదీన మన ప్రియతమ నాయకులు భారత ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదును చేసుకొని లాంఛనంగా ప్రారంభించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 592 పోలింగ్ బూతులను ప్రతి పోలింగ్ బూత్ లోను 200 భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగాలని ప్రతి కార్యకర్త రోజుకు రెండు గంటలు పని చేయాలని అదేవిధంగా ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని గతంలో 12 కోట్ల సభ్యత్వం ఈ దేశంలో తీసుకున్నారని ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందని భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశం కోసం ధర్మం కోసం పనిచేసే ఏకైక పార్టీ అని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త దేశం మొదట ఆ తర్వాతే పార్టీ ఆ తర్వాతే వ్యక్తిగతం అనే ప్రతి కార్యకర్త ఈ విధంగా పనిచేయాలన్నారు
