గురుకులాల పరిరక్షణ మన బాధ్యత కార్యక్రమం

గురుకులాల పరిరక్షణ మన బాధ్యత కార్యక్రమం


  • ఖమ్మం జిల్లాలో వివిధ గురుకులాల సందర్శన గురుకుల పరిరక్షణ జేఏసీ నాయకులు…

జ్ఞాన తెలంగాణ ఖమ్మం జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 13

ఖమ్మం జిల్లాలో వైరా మరియు మధిర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో గురుకుల పరిరక్షణ జేఏసీ- ఖమ్మం ఆధ్వర్యంలో ఆ విద్యాసంస్థల్లో సంబంధిత సంబంధిత ప్రిన్సిపాల్ మేడమ్స్ ని కలిసి ప్రాథమిక సమస్యల గురించి చర్చించి అదేవిధంగా విద్యార్థులతో కూడా మాట్లాడి ఉన్న పరిస్థితుల్ని అధిగమించి క్రమశిక్షణతో కూడిన విద్య గ్ వైపు ప్రయాణం చేయాలని చాలా ఇక్కడ నుంచి సీనియర్ ఉపాధ్యాయులు ఎంతో అనుభవం గల ఉపాధ్యాయులు అందరికీ అందుబాటులో ఉంటారు కాబట్టి విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని గొప్పగా చదువుకోవాలని అని మోటివేషన్ చేయడం జరిగింది
అదేవిధంగా వారికి ఉన్నటువంటి ప్రాథమిక సమస్యల మీద కూడా మా వంతుగా మేము ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భీమ వారి ప్రెసిడెంట్ ఉదయ్ స్వేరో వారియర్, స్వేరోస్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పృథ్వి స్వేరొ వారియర్, స్వేరోస్ జిల్లా అధ్యక్షులు గద్దల నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »