జై భీమ్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం

జై భీమ్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం


  • కార్యక్రమాన్ని ప్రారంభించిన వైరా ఎస్సై వంశీకృష్ణ భాగ్యరాజ్

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 13:

ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని 14 వార్డు గుట్టల బజార్ నందు, వినాయక చవితి సందర్భంగా జై భీమ్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం నాడు జై భీమ్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైరా ఎస్సై వంశీకృష్ణ భాగ్యరాజు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యూత్ అంతా కలిసి వినాయక నవరాత్రులు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని. దానితో పాటుగానే వినాయకుడి నిమర్జనం కార్యక్రమానికి పోలీసు వారు చేపట్టిన నియమ నిబంధనలు పాటిస్తూ వినాయక నిమజ్జనాన్ని నిర్వహించాలని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జై భీమ్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »