ఘనంగా గణపతి ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన

ఘనంగా గణపతి ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన

  • శ్రీ గణేష్ యువజన సంఘం

జ్ఞానతెలంగాణ,శంకర్పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం లోని మహాలింగాపురం గ్రామంలో శ్రీ గణేష్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహించారు.కాలనీలోని పెద్దలు,చిన్నలు,అందరూ ఐక్యంగా భక్తిశ్రద్ధలతో మహోత్సవ వేడుకలలో ఉత్సాహంతో పాల్గొనడం జరిగింది. గణనాథుడికి నైవేద్యం పెట్టి ప్రసాదాలు పంచి పెట్టారు గ్రామంలోని కుటుంబ సభ్యులందరినీ చల్లగా చూడాలని విజ్ఞాలన్ని తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.కార్యక్రమంలో గణేష్ యువజన సంఘ సభ్యులు మాట్లాడుతూ శుక్రవారం రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని,తొమ్మిది రోజుల తర్వాత గణనాథుడి నిమర్జనం కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో ప్రతిరోజు రాత్రి భజన మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక భజనలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కృష్ణ, గోపాల్, అనిల్, బలరాజ్ ,ఎల్లెష్, నరసింహ, హరీష్ కుమార్, రవీందర్, లక్షమన్, రమేష్, సురేష్, సాయి, రాజేష్, మహేశ్వర్ , శ్రవణ్, భను ప్రసాద్, సాయి కుమార్, దేవేందర్ , హరిప్రసాద్,సతీష్, నితీష్ , చరణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »