జాతీయ ఉత్తమ అధ్యాపకురాలిగా ఎంపికైన డాక్టర్ మృదుల

జాతీయ ఉత్తమ అధ్యాపకురాలిగా ఎంపికైన డాక్టర్ మృదుల

జ్ఞానతెలంగాణ, హైదరాబాద్: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5వ తేదీ అందజేసే ఈ అవార్డులకు దేశవ్యాప్తంగా 16 మంది అధ్యాపకులు ఎంపికయ్యారు. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవార్డు దక్కించుకున్న ఏకైక అధ్యాపకురాలుగా మృదుల నిలిచారు.నిజాం కళాశాలలో డిగ్రీ, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ నుంచి ఎంఏలో పీజీ చేసిన ఈమె.. ఇటీవల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసి గోల్డ్‌మెడల్‌ సాధించారు. సెప్టెంబర్ 5వ తేదీ ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరగనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈమె అవార్డును అందుకోనున్నారు.

You may also like...

Translate »