తాగి 100 కాల్ చేశాడు కటకటాల పాలయ్యాడు

తాగి 100 కాల్ చేశాడు కటకటాల పాలయ్యాడు

ఓ యువకుడు మద్యం మత్తులో డయల్ 100 కు కాల్ చేసి పోలీసు వారి సమయాన్ని దుర్వినియోగం చేయడం తో కటకటాల పాలయ్యాడు. వివరాలలోకి వెళితే నిజామాబాద్ నగరం లోని పద్మానగర్ కు చెందిన కావేటి నారాయణ డయల్ 100 కు కాల్ చేసి అమర్యాదగా ప్రవర్తించడమే కాకుండా పోలీసు వారి సమయాన్ని వృదా చేయడం తో నిజామాబాద్ 4 వ టౌన్ ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టడం తో, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గురువారం మూడురోజుల జైల్ శిక్ష విధించింది. డయల్ 100 మిస్ యూజ్ చేసిన కారణంగా మూడురోజులు ఊచలు లెక్కపెట్ట వలసివచ్చింది. ఈ ఉదంతం, మద్యం సేవించి ఇష్టానుసారంగా ప్రవర్తించే ఆకతాయిలకు కనువిప్పు గా నిలిచింది.

You may also like...

Translate »