బీజేపీ సభ్యత్వ నమోదు సెప్టెంబర్ 2న ప్రారంభం

బీజేపీ సభ్యత్వ నమోదు సెప్టెంబర్ 2న ప్రారంభం

జ్ఞానతెలంగాణ, చిట్యాల, ఆగస్ట్ 30: భారతీయ జనతా పార్టీ చిట్యాల మండలం అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ జిల్లా అధ్యక్షుడు కన్నం యోగదిశ్వర్, మరియు బిజెపి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ నాగపురి రాజమౌళి గౌడ్ విచ్చేసి మాట్లాడుతూ జాతీయ పార్టీ ఆదేశానుసారం చిట్యాల మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం వచ్చే నెల రెండో తారీఖున ప్రారంభం కాబోతుంది అని కావున కార్యకర్తలమైన మనందరం కూడా అధిక సంఖ్యలో మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఒక బూతు నుండి 200 సభ్యత్వం చేయాలని ప్రతి ఒక్కరు కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు,ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కూడా ప్రజల తరఫున నిలబడే ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమేనని కావున ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల్లాగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలిపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు గుండ సురేష్, సుద్దాల వెంకన్న, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి శ్రీపెల్లి అనిల్, మండల ఉపాధ్యక్షులు గజనాల రవీందర్,మండల కార్యదర్శి నల్ల శ్రీనివాసరెడ్డి, మహిళా మోర్చా మండల నాయకురాలు పూర్ణ, అధ్యక్షులు మైదం శ్రీకాంత్, ఎస్ టి మోర్చా జిల్లా నాయకులు ప్రభాకర్, అనుపమహేష్,గోపగాని రాజు, గుండ మణికుమార్,ర్యాకం శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »