నవాబుపేటలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు

నవాబుపేటలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు
- ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కృషికి కృతజ్ఞతలు
- కాంగ్రెస్ మహిళా మోర్చ జిల్లా ఉపాధ్యక్షురాలు పింగిలి జ్యోతిరెడ్డి
జ్ఞానతెలంగాణ, చిట్యాల,ఆగస్ట్30: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామానికి 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరైంది. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం శుక్రవారం విద్యుత్ అధికారులు స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు కోసం విశేష కృషి చేసిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావుకు కాంగ్రెస్ పార్టీ మహిళా మోర్చ జిల్లా ఉపాధ్యక్షురాలు పింగిలి జ్యోతిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఆశీస్సులతో గ్రామం మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఆకాంక్షించారు