డా.బి.ఆర్.అంబేడ్కర్ ను అస్పృశ్యుడు అనే కారణంతో గుర్రపు బండిలో ఎక్కించుకోలేదు.

డా.బి.ఆర్.అంబేడ్కర్ ను అస్పృశ్యుడు అనే కారణంతో గుర్రపు బండిలో ఎక్కించుకోలేదు.

డా. బి.ఆర్.అంబేడ్కర్ 1927 నాటికి బ్రిటిష్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో సభ్యునిగా నామినేట్ అయ్యారు.బ్రిటిష్ వారితో పీడితుల సమస్యలు గురించి చర్చించి కొన్ని హక్కులు, సౌకర్యాలు సాధించారు.నామినేటెడ్ సభ్యునిగా ఉంటూ కూడా బ్రిటిష్ పాలకులను,వారి విధానాలను కూడా విమర్శించేవారు అంబేడ్కర్.మైనారిటీల గురించి,మైనారిటీలకు ప్రాతినిధ్యం లేనిచోట్ల ఆ స్థానాలను భర్తీ చేయాలని కలెక్టర్ లకు ఆదేశాలు ఇవ్వాలని అంబేడ్కర్ డిమాండ్ చేశారు.పక్షపాతం లేకుండా అందరికీ న్యాయం అందాలని అంబేడ్కర్ బ్రిటిష్ వారిని కోరారు.

మరి ఈనాడు మన ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ప్రజలకు సేవ చేయడానికి ఉన్నా కూడా ధనవంతులకు, వ్యాపారులకు కొమ్ము కాస్తున్నారు. కనీసం నీతి అనేది లేకుండా సామాన్య జనాలకు మేలు చేయడం లేదు. స్వార్థం కోసం, డబ్బులు కోసం ఆశ పడుతున్నారు. పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. మీకు ఈ పాటీ ఉద్యోగాలు, పదవులు, అధికారం వస్తున్నాయి అంటే అదంతా అంత సులువుగా రాలేదు. మీ భవిష్యత్తు కోసం అంబేడ్కర్ తన భార్య నలుగురు బిడ్డలను కోల్పోతే వచ్చాయి.

స్టార్ట్ కమిటీ:

డా.సోలంకి సూచనల మేరకు బొంబాయి ప్రభుత్వం నిమ్నజాతుల మరియు ఆదివాసీల యొక్క ఆర్థిక, సామాజిక స్థితిగతులను పరిశీలించడం కోసం వేసిన కమిటీయే స్టార్ట్ కమిటీ. ఈ స్టార్ట్ కమిటీకు ఇ.బి.హెచ్.స్టార్ట్ అధ్యక్షుడు.ఈ స్టార్ట్ కమిటీలో డా.బి.ఆర్.అంబేడ్కర్ కూడా సభ్యుడు.

ఒక అస్పృశ్యుడు తన కొడుకును స్కూల్ లో తరగతి గది బయట కూర్చోబెడుతున్నారని ఫిర్యాదు చేయగా అంబేడ్కర్ అది తెలుసుకొని ఆ సమస్య పరిష్కరించడం కోసం స్టార్ట్ కమిటీ తరపున డా.బి.ఆర్. అంబేడ్కర్ బెల్గాం, ఖాన్ దేశ్,నాసిక్ జిల్లాకు వెళ్ళారు. ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఒక అస్పృశ్యుడు తమ స్కూలుకు వస్తున్నాడని డా.బి.ఆర్. అంబేడ్కర్ ను స్కూల్ లోనికి కూడా రానివ్వలేదు. ఉన్నత చదువులు చదివి బ్రిటిష్ కౌన్సిల్ లో నామినేటెడ్ సభ్యుడు హోదా ఉండి కూడా డా.బి.ఆర్. అంబేడ్కర్ కు కులం కారణంగా ఎదురైన చేదు అనుభవం ఎంతగానో బాధించింది. ఈనాడు ఎస్సీ, ఎస్టీలు కనీసం ఈమాత్రం అయినా గౌరవంగా బతుకుతున్నారంటే అంబేడ్కర్ త్యాగం ఎంతో ఉంది. ఆ సంగతి మరచిపోయి ఈనాటి ఎస్సీ ఎస్టీలు కృతజ్ఞతలు లేకుండా బతుకుతున్నారు.

1929 అక్టోబరు 23 న జరిగిన సంఘటన.

డా.బి.ఆర్.అంబేడ్కర్ కు టాంగా కూడా కట్టని పరిస్థితి :చాలిస్ గాం నిమ్నజాతుల వారు అంబేడ్కర్ కు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి టాంగా వాళ్ళెవరూ అంబేడ్కర్ ను తీసుకుని వెళ్ళడానికి ఒప్పుకోలేదు. డా.బి.ఆర్. అంబేడ్కర్ బ్రిటిష్ వైశ్రాయ్ కౌన్సిల్ లో నామినేటెడ్ సభ్యుడు అయినా కూడా అస్పృశ్యుడు అనే కారణంతో టాంగా(గుర్రపు బండి) వాడు తమ టాంగా ఎక్కితే మైల పడుతుంది అని టాంగా ఎక్కనీయలేదు.చివరకు ఒక టాంగా నడిపే యువకుడు కొత్తగా అప్పుడే టాంగా నడపుతున్నవాడు.ఆ యువకుడు అంబేడ్కర్ ను తన టాంగాలోకి ఎక్కించుకోగా అంబేడ్కర్ ఆ టాంగా ఎక్కారు. కొంతదూరం వెళ్ళిన తర్వాత ఆ యువకుడు టాంగా కొత్తగా తోలడం వలన గుర్రాలు బెదిరాయి.బండి బోల్తా పడటంతో అంబేడ్కర్ కింద పడిపోయారు.ఒక రాయి మీద పడ్డారు అంబేడ్కర్. హఠాత్తుగా పడిపోయిన అంబేడ్కర్ యొక్క తన కుడిపాదం ఎముక కూడా విరిగింది.**విరిగిన కాలుతో అంబేడ్కర్ చాలా బాధపడ్డారు.రెండు నెలలు పాటు మంచం పట్టారు.విరిగిన కాలుతో విశ్రాంతి తీసుకోవలసిన సమయంలో కూడా డా.బి.ఆర్.అంబేడ్కర్ 1929 డిసెంబర్ 8 న బాంబే క్రానికల్ లో ‘Wanted an Anti-priest Crapt Association’ (‘పురోహిత వ్యవస్థ నిర్మూలన’ ) శీర్షికతో వ్యాసాన్ని వ్యంగాత్మకంగా వ్రాశారు.అంబేడ్కర్ 1929 వరకు కూడా అనారోగ్యంతో ఉన్నారు.

స్టార్ట్ కమిటీ నివేదికలో నిమ్నజాతుల వారికి మేలు చేసే సూచనలు

1930 లో డా.అంబేడ్కర్ స్టార్ట్ కమిటీకు నివేదిక సమర్పించారు.ఆ నివేదికలో నిమ్నజాతుల వారు హిందువులు యొక్క ఆచారాలు, పండుగలు అనుసరిస్తున్నా,వెలివేయబడి అగ్రవర్ణాల వారిచే అస్పృశ్యులుగా పిలవబడి ఊరికి దూరంగా ఉంచబడుతున్నారని, నిమ్నజాతుల వారికి విద్య. కోసం స్కాలర్ షిప్ లు ఇవ్వాలని, హాస్టల్ సౌకర్యాలు కల్పించాలని,ఫ్యాక్టరీలు, రైల్వే కర్మాగారాలలో ఉద్యోగాలు కల్పించాలని అందుకోసం శిక్షణ కూడా ఇప్పించాలని, ఇంకా ఉన్నత చదువులు కోసం, విదేశీ చదువులు కోసం స్కాలర్ షిప్ లను ఇచ్చి ప్రోత్సాహం అందించాలని, సుక్కూరు బ్యారేజీ స్కీములో నిమ్నజాతుల వారికి ప్రాతినిధ్యం ఇవ్వాలని, అలాగే నిమ్నజాతుల వారిని పోలీసు, మిలటరీ సర్వీసులో కూడా చేర్చుకోవాలని, పట్టణాలలో నివాసం కల్పించాలని, బంజరు భూములు, అటవీ స్థలాల నివాస స్థలాలుగా కేటాయించాలని స్టార్ట్ కమిటీ చెప్పింది.

మిత్రులారా…బాబాసాహెబ్ అంబేడ్కర్ తన విరిగిన కాలితో కూడా మనందరి కోసం తపించారు.ఈనాటి యువతీయువకులు అంబేడ్కర్ ను ఆదర్శంగా తీసుకుని తమ బాధ్యతలు సక్రమంగా నెరవేర్చాలి.

అరియ నాగసేన బోధి,M.A.,M.Phil.,TPT.,LL.బి,ధమ్మ ప్రచారకులు & న్యాయవాది1

  1. ↩︎

You may also like...

Translate »