నాకు చదువు నేర్పిన పాఠశాలకు, ఏం చేసినా తక్కువే..,

నాకు చదువు నేర్పిన పాఠశాలకు, ఏం చేసినా తక్కువే..,

మాజీ ఎంపీటీసీ బొల్లారం వెంకట్ రెడ్డి.

  • ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా పొద్దుటూరు ప్రభుత్వ బడిని తీర్చిదిద్దుతూ….,
  • ఓనమాలు నేర్పిన పాఠశాల రుణం తీర్చుకుంటున్న, పొద్దుటూరు మాజీ ఎంపీటీసీ బొల్లారం వెంకట్ రెడ్డి
  • హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్ లకు సీసీ కెమెరాల ఏర్పాటు
  • అభినందించిన శంకర్ పల్లి ఎంఈఓ అక్బరుద్దీన్
  • ఆనందం వ్యక్తం చేసిన, ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు
  • స్పాన్సర్ బొల్లారం వెంకటరెడ్డికి, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన స్కూల్ చైర్మన్ లక్ష్మి

జ్ఞాన తెలంగాణ, జూలై 20, శంకర్ పల్లి:

పొద్దుటూరు ప్రభుత్వ పాఠశాల రంగారెడ్డి జిల్లాలోనే, ప్రత్యేకతను చాటుకుంటుంది అందుకు కారణం నిష్ణాతులైన ఉపాధ్యాయులు, క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు, సకల సౌకర్యాలు, నాణ్యత కలిగిన విద్య, పదవ తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత. వీటన్నిటికీ మూల కారణం తన బాల్య వయసులో, ఓనమాలు దిద్దించి, అక్షరజ్ఞానం నేర్పి, తనను తీర్చిదిద్ది, ప్రయోగజకుడిని చేసిన పాఠశాలను ఏమాత్రం మర్చిపోకుండా, పే బ్యాక్ టు ద సొసైటీ అనే విషయాన్ని తుచా తప్పకుండా పాటిస్తూ స్కూల్ కొరకు ఏది అడిగినా కాదనకుండా సహాయం చేస్తూ విద్యార్థులు నాణ్యమైన విద్యను నేర్చుకొనుటకు బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకొనుటకు తన వంతుగా విసుగక తోడ్పాటు నందిస్తూ వస్తున్న పొద్దుటూరు గ్రామ మాజీ ఎంపీటీసీ బొల్లారం వెంకట్ రెడ్డి. పొద్దుటూరు ప్రభుత్వ పాఠశాలలో ఏ సమస్య ఉన్న, ఎలాంటి కొరత ఉన్న అడిగిన వెంటనే కూర్చుతూ, ప్రభుత్వ పాఠశాలకు ఎంతో తోడ్పాటు అందిస్తున్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ పదవ తరగతిలో పాస్ అయిన విద్యార్థికి పదివేల రూపాయలు చొప్పున ప్రతి ఏట నగదు బహుకరిస్తూ, విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. పొద్దుటూరు ప్రభుత్వ పాఠశాలకు నూతనంగా ఎన్నికైన చైర్మన్ ఏనుగు లక్ష్మి కృషితో, పొద్దుటూరు మాజీ ఎంపిటిసి బొల్లారం వెంకట్ రెడ్డి సహాయంతో , హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన చేస్తున్న సేవలను ఏమాత్రం వృధా చేయకుండా ఈ పాఠశాల నుంచి వెళ్లిన విద్యార్థులు ఇంజనీరింగ్, ఎంబిబిఎస్ వంటి ఉన్నత చదువుల వైపు అడుగులు వేస్తున్నారు రాబోయే 10 ఏళ్లలో పొద్దుటూరు ప్రభుత్వ పాఠశాల నుండి గొప్ప గొప్ప ఇంజనీర్లను, డాక్టర్లను ,ఐఏఎస్,ఐపీఎస్ లను చూస్తా వనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సందర్భంగా, శంకర్ పల్లి ఎంఈఓ మాట్లాడుతూ ఎల్లవేళలా పాఠశాలకు అండగా నిలుస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న పొద్దుటూరు మాజీ ఎంపిటిసి బొల్లారం వెంకటరెడ్డి కి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అక్బరుద్దీన్, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,స్కూల్ చైర్మన్ ఏనుగు లక్ష్మి, నాని బుచ్చయ్య, నాని మల్లేశ, బూర్దుల మల్లేశ , విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

You may also like...

Translate »