విద్యార్థిని పై కీచక హెడ్ మాస్టర్ వేధింపులు

విద్యార్థిని పై కీచక హెడ్ మాస్టర్ వేధింపులు

విద్యాబుద్ధులు నేర్పించి సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే వక్రబుద్ధితో వ్యవహరించడం కలకలం రేపుతోంది. పాఠశాలలోని విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన బాన్సువాడ మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేశాయిపేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విద్యార్థిని భయంతో తోటి విద్యార్థినులకు విషయం చెప్పడంతో విషయం బయటకు పొక్కింది. మరో నలుగురైదుగురు విద్యార్థినులను సైతం వేధించినట్లు సమాచారం. ఈ విషయం విద్యార్థినులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో.. తల్లిదండ్రులు గ్రామస్థులతో కలిసి పాఠశాలకు వెళ్లి నిలదీశారు. విషయం జిల్లా బాలల సంక్షేమ కమిటీ సభ్యుల వద్దకు చేరడంతో విద్యార్థినిపై హెచ్ఎం లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. దీంతో హెచ్ఎం నరేందర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా ప్రయత్నించిన మరో తొమ్మిది మందిపై కూడా పోలీసులు కేసు పెట్టారు. వీరిలో ఓ పోలీసు సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం

You may also like...

Translate »