ఉపాధి హామీ కూలీల పెండింగ్ డబ్బులు చెల్లించండి.

ఉపాధి హామీ కూలీల పెండింగ్ డబ్బులు చెల్లించండి.
– శంకర్ పల్లి మండల వ్యవసాయా కార్మిక సంఘం అధ్యక్షులు బోడ మల్లేశం
జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి,జులై 10:శంకర్ పల్లి మండలంలోని పలు గ్రామాల్లోని ఉపాధి కూలీలకు గత కొన్ని రోజులుగా ఉపాధి హామీ డబ్బులు రావడం లేదని,రాష్ట్రంలో వర్షాలు పడక ఉపాధి హామీని నమ్ముకుని నివసిస్తున్న నిరుపేదల కన్నీళ్లు వర్ణనాతితమని రెక్కడితే కానీ డొక్కా ఆడని రైతులు, రైతు కూలీలు ఉపాధి హామీ డబ్బుల కోసం ఎదిరి చూస్తున్నారని కొందరికి గత రెండు నెలలుగా పెండింగ్ ఉంది.మరి కొంత మందికి 3 వారాలు, ఇంకొందరికి 2 వారాల డబ్బులు రాలేదని,ఇలా మండలం లోని పలు గ్రామాల కూలీలు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే ఉపాధి హామీ కూలీల డబ్బులు విడుదల చేయాలనీ శంకర్ పల్లి మండల వ్యవసాయా కార్మిక సంఘం అధ్యక్షులు బోడ . మల్లేశం డిమాండ్ చేశారు