“మత గ్రంధాల రాతలు” పిట్ట కథలు,కట్టుకథలే

“మత గ్రంధాల రాతలు” పిట్ట కథలు,కట్టుకథలే
-అడియాల శంకర్,అధ్యక్షులు, తెలంగాణ హేతువాద సంఘం
ఈ దేవుడు, ఆ దేవుడు ఆ దేవుని కొడుకే.ఈ దేవుడు, ఆ దేవుని అంశాన పుట్టిన కొడుకే.ఈమె ఆ దేవుని బార్యఆ దేవుడు ఈ దేవుడి మనవడు.ఈ దేవుడు ఇంకో ఆయనకు మనవడు. ఈమె ఆమె బిడ్డకు పుట్టినది ఆ దేవత అంశాన ఈ దేవత పుట్టినదే.ఇలా లేని దేవుళ్ళకు, దేవతలకు వావి వరసలు కల్పించి, వాటిని మత గ్రంథాల్లో ఉటంకించి మనుషుల మెదళ్ల ను పాడు చేశారు మత గ్రంథాలు రాసిన వాళ్ళు. ఇంకా దేవుళ్ళు అత్యంత అసహ్యకరంగా, అసహజంగా పుట్టారని కూడా రాశారు.. మన దేవుళ్ళు ఇలా పుట్టడమేమిటి? అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేసినా చాలామంది మాత్రం “వాళ్ళ మహిమలు, మాయలు వాళ్ళు ఎలా పుట్టినా కూడా పూజనీయులే” అని సమాధాన పరుచుకుంటారు.మత గ్రంథాల రాతలన్నీ పిట్ట కథలు, కట్టుకథలు, అబద్ధాలతో నింపేశారు.ఒక మత గ్రంథంలో మహాపురుషుడు జన్మించాడని అతడి ముఖం నుండి ఒక జాతి పుట్టిందని, ఛాతీ భాగం నుండి ఒక జాతి పుట్టిందని, తొడల నుండి మరో జాతి పుట్టిందని, పాదాల నుండి ఇంకొక జాతి పుట్టిందని అసహ్యకరంగా రాశారు.ఇది వినడానికి కూడా అసహ్యకరంగా ఉంది.ఆ మహా పురుషునికి ఒళ్లంతా యోనులు ఉన్నాయా? ఎవరూ చెప్పరు క్లారిటీ ఇవ్వరు. ఆ మహాపురుషుడు ఎవరికి పుట్టాడో? ఎక్కడ నుండి పుట్టాడో వాళ్లకే క్లారిటీ లేదు. మత గ్రంధాలు చదివితే పూర్తిగా మతి పోతుంది. దేవుళ్ళందరి జననాలు యోనుల నుండి కాక ఒకరు పొదల్లో పుట్టారని,ఒకరు పాయసానికి పుట్టారని, ఒకరు వీర్యాన్ని జారవిడి స్తే దానిని మింగితే పుట్టారని.ప్రపంచంలో ఎక్కడా లేని వికారము ,అసహ్యమంతా మత గ్రంధాల్లో నింపేశారుఒక మత గ్రంథంలో లోని దేవుడు ఏడు రోజులలో ఈ ప్రపంచాన్ని సృష్టించాడని రాశారు ఆయన పుట్టుకకు ఎవరు కారణమో చెప్పరు ఆయన ఏ వస్తు సముదాయంతో సృష్టించాడో? చెప్పరు. ఆయన ఎక్కడ ఉండి ఈ ప్రపంచాన్ని సృష్టించాడో? చెప్పరు,ఏ సాంకేతిక నైపుణ్యాన్ని వాడాడో ఎవరూ చెప్పరు ఇలా ఉంటాయి మతాలు, మత గ్రంథాలు. అన్ని అబద్ధాలే వట్టి పిట్టకథలే. అన్ని ప్రశ్నలే. ఏ ప్రశ్నకు సమాధానం దొరకదు. ప్రశ్నలు అడిగితే పవిత్రం పవిత్రం అంటారు. ఏ మత గ్రంధాన్ని ప్రశ్నించ కూడదంటారు. ఒక్క మత గ్రంథమైనా, సహజంగా హేతుబద్ధంగా ఉండదు. అన్ని మత గ్రంథాలు తప్పులు తడకలే. మరో మత గ్రంథం లోని దేవుడు పంపగా వచ్చిన దూత తన చిటికెన వేలుతో చంద్రుని ముక్కలు చేశాడని తర్వాత అతికించాడని, ఆధారం లేని కథను చెబుతారు ఈ కథలన్నీ కూడా కేవలం మతాలను స్థిరపరచడానికి, దేవుడు అని ప్రజలను నమ్మించడానికి, ఉన్నాడనడానికి మాత్రమే పనికి వచ్చేట్టు తయారు చేశారు. దేవుడు దేవతలు దేవుళ్ళు అని అంటున్న ప్రతి ఒక్కరూ మనల మనం మోసం చేసుకున్నట్లే.మత బోధకుల, మత ప్రచారం చేసేవారి, మతం పేరుతో దోపిడీ చేసే వాళ్లను మనం ప్రోత్సహించినట్లే. అజ్ఞానాంధకారములో చిక్కుకున్న ఈ ప్రజలను మోసం చేస్తున్నట్లే. దేశంలో 97% మంది ప్రజలకు నమ్మడమే తెలుసు ఆలోచించడం తెలియదుదేవుడు అనే పదమును ఎవరు సృష్టించారు? ఇంకెవరు? మత గ్రంథాలు రాసిన వాళ్లే. సైన్సు లేని కాలంలో ఈ ప్రపంచాన్ని ప్రకృతిని ఎవరో ఒక దివ్య శక్తి నడిపిస్తుందని అనుకున్నారు. అంతే.కానీ మత గ్రంథాలనురాసిన వాళ్లే దేవుడు అనే పదాన్ని సృష్టించారు వాళ్లే పెద్ద నేరస్తులు. పెద్ద దొంగలు, దేవుళ్ళు లేరు. దేవుళ్లను ఎవరూ చూడలేదు, దేవుళ్ళు ఉంటే కదా దేవుళ్లను చూడడానికి? రాముడు అల్లా యేసు హనుమంతుడు కృష్ణుడు లాంటి దేవుళ్ళు ఎంతో మంది ఉన్నారు? కానీవీళ్ళు ఎవ్వరూ దేవుళ్ళు కారు. దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? సమాజ దోపిడీదారులే. కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని అజ్ఞానంలో ముంచి వాళ్ళ స్వార్థము. స్వలాభం కోసము దేవుడున్నాడని మాట్లాడుతుంటారు.ఈ దేవుళ్ళు ఎవరూ లేరుఅంతా కల్పిత, కట్టుకథలు, దోపిడీ ఆలోచన ఉన్నవాళ్లు రచించిన కల్పిత కట్టు కథలు అంతా ఊహాత్మక రచనలే.నిజానికి దేవుళ్ళు లేరు, కల్పిత కట్టు కథలతో రచించిన రచనలు వాటిని కథలుగా కథలుగా ఆనాటి నుండి ప్రజలకు చెప్పుతూ చెబుతూ అవి ఈనాడు సినిమాల రూపంలో కూడా సినిమాలుగా తీస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. పక్కదారి పట్టిస్తున్నారు. సినిమాలు నాటకాలు డ్రామాలు కథలు, సీరియల్స్ కథలుగా తీసి ప్రజలను అజ్ఞానంలో ముంచుతున్నారు. సామాన్య ప్రజల్లో అనవసరంగా వాళ్ల మెదళ్లలో తీసివేయలేనంతగా స్థిరపరిచారుమనం గాలి, నీరు, భూమి, అగ్ని అనే చతుర్భూతాల వలన బ్రతుకుతున్నాము. మనమే కాదు ప్రతి ప్రాణి కూడా వీటితోనే బ్రతుకుతున్నాయి.ఇవి మన భూమిపై కలవు .ఇవి కంటికి కనిపిస్తున్నాయి. స్పర్శ అనుభవిస్తున్నాము.ఉనికిలో ఉన్నవి. చూస్తూ ఉన్నాం.భూమిని చూస్తూ ఉన్నాం అగ్నిని చూస్తూ ఉన్నాం. నీరును చూస్తూ ఉన్నాం. గాలి స్పర్శను అనుభవిస్తున్నాం.వీటినుపయోగించుకుని సకల ప్రాణులు మనిషితో సహా బ్రతుకుతున్నాయి ఇవి లేకుంటే ఏ ప్రాణి ఉండదు. ఏ చెట్టు ఉండదు. ఏ గుట్ట ఉండదు. ఎలాంటి వాతావరణం ఉండదు. ఇవే మనల్ని బతికిస్తున్నాయి ఏ దేవుడు రాలేదు ఏ దేవుడు మనకు సాయపడలేదు ఈ దేవుడు ఏ ప్రాణిని కూడా కాపాడిన సందర్భం లేదు. ఏ మత దేవుడు కూడా మనల్ని బతికించడం లేదు. అలాగని చంపడం లేదు.ఇంతవరకు ఏ మత దేవుడు కూడా ఏ ప్రాణిని కూడా కాపాడడానికి రాలేదు. కాపాడినట్టుగా మనం వినలేదు. చూడలేదు. అసలు మన స్పర్శకు కూడా దేవుడు ఇంతవరకు రాలేదు మన జ్ఞానేంద్రియాలైన కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం వీటికి ఎప్పుడూ దేవుడు చిక్కలేదు.రాముడు లేకపోతే బ్రతకగలం. అల్లాహ్ లేకున్నా బ్రతకగలం. ఏసు లేకున్నా బ్రతకగలం. మనుషులు చేసిన దేవుడి బొమ్మలు లేకున్నా మనం స్వేచ్ఛగా, సమానత్వంతో బ్రతకగలం.మనుషులే వ్యవసాయం చేస్తున్నారు. దానికి అవసరమైన పరికరాలు మనిషే తయారు చేస్తున్నాడు. వ్యాపారాలు చేస్తున్నారు. మనుషులే ఉద్యోగాలు చేస్తున్నారు.మనుషులు వ్యవసాయదారులు పండించిన పంటలు తింటున్నారు.ఇలా ఎవరు చేసే పని వారు చేస్తూ తమ జీవనాన్ని గడుపుతున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుడు చెప్పింది శ్రద్ధగా విని చదువుకుంటే పాస్ అవుతున్నారు.ఏ దేవత వచ్చి వారి పరీక్షలు రాయడం లేదు వారిని పాస్ చేయడం లేదు. మన జీవితంలో దేవుడి పాత్ర ఏమిటి? మన జీవితములోని ఏ ఒక్క క్షణమైనను మనకు దేవునితో పనిలేదుపెళ్లిళ్లు వధువు వరుడు నచ్చిన తర్వాతనే పెద్దలు ముందుకు వచ్చి పెళ్లి పనులన్నీ చేసి పెళ్లి చేస్తున్నారు కానీ పెళ్లిళ్లుస్వర్గంలో జరుగుతాయి అన్న మాట అబద్ధం.అన్ని మత గ్రంథాలు మనుషులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఏదో ఉందని ఆకాశం వైపు చూసేట్టుగా చేస్తున్నాయి.దుర్మార్గాలు చేయిస్తున్నాయి. ప్రజల బతుకులు వీధిన పడేస్తున్నాయి. కన్నబిడ్డలకు కూడా గంజి దొరకని పరిస్థితి కల్పిస్తున్నాయి. ఆశలు కల్పిస్తున్నాయి. నిరాశకు గురి చేస్తున్నాయి. మనిషికి మనిషికి మధ్య అగాధాన్ని సృష్టించి, అసమానతలు కల్పిస్తున్నాయి. మతాలు, మత గ్రంథాలు విడిచి, మానవ ధర్మాన్ని ఆచరిస్తే మానవునికి సుఖము, సంతోషము, స్వేచ్ఛ, సమానత్వం సిద్ధిస్తాయి.
