గ్రూప్‌-2 వాయిదా..?

గ్రూప్‌-2 వాయిదా..?

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిర్వహించనున్న గ్రూప్‌-2 వాయిదా వేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానున్నదని సమాచారం. అలాగే TSPSC గ్రూప్-2 పోస్టుల సంఖ్య పెంచాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలను నిర్వహించనున్నారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షలు ఒకదాని వెంటే మరొకటి ఉందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల నిర్వహించిన సమావేశంలో పరీక్షల వాయిదా అంశంపై చర్చించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో గ్రూప్‌-2 వాయిదా వేయిదాకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ గ్రూప్‌-2 పోస్టులను పెంచి.. ఈ పరీక్షలను డిసెంబర్‌లో నిర్వహించాలి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు

You may also like...

Translate »