తెలంగాణ వైద్యులందరికీ జాతీయ వైద్యుల దినోత్సవం శుభాకాంక్షలు

తెలంగాణ వైద్యులందరికీ జాతీయ వైద్యుల దినోత్సవం శుభాకాంక్షలు
- డా. ఆనంద్ ఎంబిబిఎస్, ఎంఎస్, ఎం సి హెచ్ (ఉస్మానియా)అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ యూరాలజీ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెంబర్
మహనీయులు వైద్య పితామహుడు సామాజికవేత్త , రాజకీయ వేత్త, స్ఫూర్తి ప్రదాత డా. బి. సి. రాయ్ గారి జన్మదిన సందర్భంగా
మన డాక్టర్స్ అందరూ మనo సంబరాలను చేసుకుంటూ మన యొక్క వృత్తి ధర్మని గుర్తు చేసుకుంటూ మానవసేవే మాధవసేవా అని..
డాక్టర్స్ ప్రొఫెషన్ ఒక నోబెల్ ప్రొఫెషన్ గా ఎంచుకున్న మనమందరం ప్రస్తుతo ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన సమయం ఇది.
సర్వీస్ ను సామాజిక దృక్పథంతో చేస్తున్నామా? లేదా సర్వీస్ ఓరియెంటేషన్ బిజినెస్ వైపు దారితీయటం అనేది సమాజానికి, ప్రజలకు మంచిది కాదు. డాక్టర్స్ మోరల్స్ అండ్ ఎథికల్ ప్రాక్టీస్ చేయడం వలన మనలోని సామజీక స్పృహ మరియు భాద్యత తెలియజేస్తుంది.
ఇందులో ప్రజలు కూడా భాగస్వామ్యం కావలసి ఉంటుంది. ఆధునిక సమాజం లో అడ్వాన్స్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్న మన ఆరోగ్యం పట్ల అంకితభావం శ్రద్దా కలిగివుండాలి. రోగులు వైద్యుల పట్ల నమ్మకం కలిగి ఉండాలి. త్వరగా ఉపశమనం కోసం అధిక డోసు వాడినట్లయితే రోగులకు నష్టం జరుగుతుంది. ఎమర్జెన్సీలో రోగులు క్రిటికల్ కండిషన్ లో ఉన్నప్పుడు ప్రతి డాక్టర్ కూడా పేషంటును బతికే ప్రాణాలు కాపాడడం కోసం 100 కి 200 శాతం ప్రయత్నిస్తాడు. అనుకోని పరిస్థితల్లో పేషంట్ చనిపోవడం వలన వైదులపైన దాడులు చేయడం తగదు. మీకు అన్యాయం జరిగింది అని బావిస్తే
మెడికల్ కౌన్సిల్ ని ఆశ్రయించొచ్చని ఆశ్రయించాలి కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని వైదుల పై దాడి చేయడం అమానుషం. నా తోటి వైధులకు వైద్య మండలి తరుపున విజ్ఞప్తి … ఎథికల్ గా ప్రాక్టీస్ చేయండి. మెడికల్ సమస్యలను పెషెంట్ కి అర్థమయ్యె విధంగా కూలంకషంగా వివరించండి.
తమ పరిమితి లో ప్రాక్టీస్ చేయండి. నకిలీ వైదులను ప్రోషించికండి..అంబులెన్సు మరీ ఎలాంటి మాఫియాను ఎంకరేజ్ చేసి మన వైద్య వృత్తికి చెడ్డ పేరు తీసుకురాకండి. భావి తరాలకు ఒక బంగారు బాటాగా నీలుదాం. ఏ డాక్టర్ కూడా అన్ ఎథికల్ ప్రాక్టీస్ చేస్తూ మెడికల్ ప్రోఫెషన్ దిగజారేలా చేసిన చర్యలు తప్పవు. ప్రజలు కూడా క్వాలిఫైడ్ వైద్యుల దగ్గరికి వెళ్లి వైద్యం చేపించుకోవాలని కోరుతున్నాను.