భద్రాచలంలో ఘనంగా మల్లు బట్టి విక్రమార్క గారి జన్మదిన వేడుకలు ..


కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన పొదెం గారు
జ్ఞానతెలంగాణ/ భద్రాచలం. జూన్ 15:
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారి జన్మదిన వేడుకలు భద్రాచలం మండల కాంగ్రెస్ అధ్యక్షులు పరిమి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో శనివారం భద్రాచలం పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, భద్రాచలం మాజీ శాసనసభ్యులు పొదెం వీరయ్య ఈ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీరయ్య గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి బట్టి గారు చేసిన సేవలను గుర్తు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కొరకుఅహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు చింతిరాల రవికుమార్ గారు, సీనియర్ నాయకులు రౌతు నరసింహ రావు గారు, బంధం శ్రీనివాస్ గౌడ్ గారు, తమ్మల్ల వెంకటేశ్వరరావు ( టీవీ )గారు, సుంకర శేషు గారు, గానుగ రమణగారు, సేవాదళ్ ఏ బ్లాక్ అధ్యక్షులు అశోక్ కుమార్ గారు, సేవల మండల అధ్యక్షులు శీలం రామ్మోహన్ రెడ్డి గారు, కాపుల శ్రీను గారు (ఏసు ), కురుస చిట్టి బాబు గారు, యూత్ కాంగ్రెస్ నాయకులు చింతిరాల సుధీర్ కుమార్ గారు, హలీం గారు, వాసిరెడ్డి సాంబశివరావు గారు, కోలపూడి వరుణ్ గారు, నాయుడు గారు, ఆర్టీసీ ఐఎన్టీయూసీ నాయకులు సింగు గారు, శ్యామల శ్రీనివాస్ గారు, మణి గారు, నితిన్ గారు, అవినాష్ గారు, స్వరూప్ గారు, సోషల్ మీడియా ఇన్ఛార్జి సిద్ది గణేష్ గారు, మణి గారు మహిళా నాయకులు సరిత గారు హసీనా వసీమా జయ గార్లు తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »