బ్యాంకుకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన వ్యక్తి అదృశ్యం

బ్యాంకుకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన వ్యక్తి అదృశ్యం
జ్ఞాన తెలంగాణ
శంషాబాద్ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్దతుప్ర తాండ కు చెందిన వ్యక్తి బ్యాంకు కు వెళ్తున్నానని చెప్పి అదృష్యమైనాడు.
వివరాల్లోకెలితే శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ హౌస్ ఇన్స్పెక్టర్ తెలియ జేసిన వివరాల ప్రకారం మంగళవారం రోజున ఉదయం 11 గంటల సమయంలో పెద్ద తుప్రా తాండ కు చెందిన పాత్లావత్ సాయి కుమార్ (24) పెద్ద తూప్రా లో ఉన్న బ్యాంకు కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయలుదేరి వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ అఫ్ రావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువుల ఇళ్లలో ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్ ని అశ్రాయించారాని తెలియ జేశారు.తప్పిపోయిన వ్యక్తి ఎత్తు 5.5 “అడుగులు, రంగు: ఫెయిర్ కలర్, బ్లూ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, లంబాడా భాషలు మాట్లాడతాడని తెలియ జేశారు. ఇట్టి విషయంపై చర్యతీసుకోవాలని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు ప్రారంభించారు.