హనుమకొండ కింగ్స్ విక్టరీ.. ఉత్సాహభరితంగా జర్నలిస్టుల క్రీడలు:

హనుమకొండ కింగ్స్ విక్టరీ.. ఉత్సాహభరితంగా జర్నలిస్టుల క్రీడలు:
జ్ఞాన తెలంగాణ హనుమకొండ
గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్-2024 లో భాగంగా రెండో రోజు శుక్రవారం క్రీడలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి.ఉదయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో జరిగిన క్రికెట్ పోటీలో పాల్గొన్న క్రీడాకారులను ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారపు సదయ్య,ముఖ్యఅతిథిగా హాజరైన కాజీపేట ఏసిపి తిరుమలకు పరిచయం చేశారు.అనంతరం టాస్ వేసి క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు.శుక్రవారం నాడు ఉదయం ప్రాణహిత జట్టుకు మరియు హన్మకొండ కింగ్స్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో హనుమకొండ కింగ్స్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో ఓపెనర్లు ఆంధ్రజ్యోతి డెస్క్ ఇంచార్జి మైనం సుధాకర్, దిశ బ్యూరో చీఫ్ ఆరెల్లి కిరణ్ శుభ రంభం చేశారు. మైదం సుధాకర్ ప్రెస్ క్లబ్ చరిత్రలో తొలిసారిగా సెంచరీ చేశాడు. కేవలం 41బంతుల్లో 111 పరుగులు (నాటౌట్) చేసి స్ట్రైక్ రేట్ 270 తో సంచలనం సృష్టించారు.12 ఓవర్ల లో రెండు వికెట్ల నష్టానికి హనుమకొండ కింగ్స్ 192 పరుగులు చేశారు.ఈ టీం చేసిన మొత్తం పరుగులు కూడా వరంగల్ ప్రెస్ క్లబ్ చరిత్రలోనే తొలిసారి రావడం విశేషం.తొలిసారి సెంచరీ చేసిన సుధాకర్ ను జర్నలిస్టులు అభినందించారు. శుక్రవారం యంగ్ బ్యూరోలకు, వరంగల్ రాక్స్ జట్ల మధ్యన పోటీ జరగగా యంగ్ బ్యూరోస్ విజయం సాధించారు.అలాగే నమస్తే తెలంగాణ డెస్క్,లగాన్ టీంకు మ్యాచ్ జరగ గా లగాన్ విజయాన్ని సాధించింది.సాక్షి డిస్క్ టీం తో, వరంగల్ ఈస్ట్ డ్రాగన్ తో తలపడగా సాక్షి డెస్క్ విజయం సాధించింది.
