విద్యార్ధి అదృశ్యం

జ్ఞాన తెలంగాణ
శంషాబాద్

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ని రాళ్లగూడ దొడ్డి గ్రామంలో ని యువతీ అదృశ్యం అయింది. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ హౌస్ ఇన్స్పెక్టర్ తెలియజేసిన వివరాలప్రకారం
నానాజీపురం శృతి 20 శంషాబాద్‌లోని గౌతమి కాలేజీకి రోజు మాదిరిగా వెళ్లింది, కాలేజీ పూర్తయిన తర్వాత ఇంటికి సమయానికోచ్చేది కానీ గత మంగళవారం రోజున ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు శృతి కోసం చుట్టుపక్కల ప్రాంతాలలో మరియు బంధువుల ఇళ్లలో వెతికినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్ ను అశ్రాయించారాని తెలియ జేశారు . తప్పిపోయిన మహిళ ఎత్తు 4.5 అడుగులు, చామనచాయా కలర్ వుంటుంది మరియు బ్లాక్ కలర్ గౌను ధరించినది , ఆమె తెలుగు మాట్లాడుతుందని తెలియజేసారు .

You may also like...

Translate »