ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన : కలెక్టర్ ఎం.మను చౌదరి.

జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిధి జూన్ 14.

సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం నర్మెట్ట గ్రామ పరిధిలోగల ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి క్షేత్రస్థాయిలో పరీశిలింఛారు.

సుమారు 300 కోట్ల నిర్మాణ వ్యయంతో ఆయుల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతున్నట్టు టిజి ఆయిల్ ప్రెడ్ అధికారులు కలెక్టర్ కి తెలిపారు. ఇప్పటివరకు పనులు మందకోడిగా సాగుతున్నందున అసహనం వ్యక్తం చేస్తూ నిర్ణీత కాల పరిమితి లోపు తప్పనిసరి గా ఆయిల్ పాం ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ఎట్టి పరిస్థితిలో పూర్తి చెయ్యాలని హెచ్చరించారు.

అయిల్ ప్రెడ్ అధికారులు మ్యాప్ ను చూపిస్తూ నిర్మాణ దశలను ఇప్పటి వరకు వాటర్ ట్యాంక్, పాం-పౌండ్ నిర్మాణం, కార్యాలయం భవనం దాదాపు పూర్తి కావచ్చాయని అధికారులు కలెక్టర్ కి తెలిపారు.

ఇక్కడ ఇసుక కొరత ఉన్నందున కమిషనర్ స్థాయిలో మాట్లాడి భూపాలపల్లి నుండి ఇసుక డంపు చేసుకునేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఫ్యాక్టరీ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని కాంటాక్ట్ లకు తెలపాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.

కాంట్రాక్టర్లు తమ కేటాయించిన పనులను యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేయాలి. జిల్లాలో ఆయిల్ ఫామ్ పంట దిగుబడి మొదలవుతున్న క్రమంలో ఫ్యాక్టరీ నిర్మాణం వేగంగా పూర్తి చేస్తే రైతులకు లాభం చేకూర్చేలా ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ వెంట జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సువర్ణ, టీజీ ఆయిల్ పెడ్ అధికారులు తదితరులు ఉన్నారు.

You may also like...

Translate »