విధి నిర్వహణలో హోంగార్డ్ నారాయణ స్వామి సేవలు మరువలేనివి

విధి నిర్వహణలో హోంగార్డ్ నారాయణ స్వామి సేవలు మరువలేనివి
-హోంగార్డ్ పదవీ విరమణ కార్యక్రమంలో సీఐ దగ్గు మల్లేష్ యాదవ్, ఎస్ఐ బి అశోక్
జ్ఞానతెలంగాణ, చిట్యాల, జూన్ 14:
ప్రజలతో మమేకమై, అధికారుల సమన్వయంతో..విధి నిర్వహణలో భాగంగా అంకితభావంతో ప్రజలకు తమ ఉత్తమ సేవలను అందించిన హోంగార్డ్ నాగంపల్లి నారాయణ స్వామి సేవలు మరువలేనివని చిట్యాల సీఐ దగ్గు మల్లేష్ యాదవ్, మొగుళ్ళపల్లి ఎస్ఐ బి అశోక్ లు కొనియాడారు. గత 30 సంవత్సరముల నుండి హోంగార్డుగా విధులు నిర్వర్తించి పదవి విరమణ పొందిన నారాయణస్వామి ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటుచేసిన వీడ్కోలు సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో హోంగార్డ్ నారాయణ స్వామి దంపతులను పోలీస్ సిబ్బంది, హోంగార్డుల సంఘం నేతలు శాలువాలతో ఘనంగా సత్కరించారు.
-పోలీస్ స్టేషన్ కు ఆయువు పట్టువులే హోంగార్డులు
-హోంగార్డుల సంఘం స్టేట్ ప్రెసిడెంట్ పుప్పాల అశోక్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో నక్సలైట్ ప్రాబల్యం అధికంగా ఉన్నప్పటికీ పోలీస్ స్టేషన్ కు ఆయువు పట్టవుల కీలక భాగస్వామ్యాన్ని హోంగార్డులు నిర్వహించారని, ఆ రోజు నుంచి ఈరోజు వరకు పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి బెనిఫిట్స్ అందడం లేదని హోంగార్డుల సంఘం స్టేట్ ప్రెసిడెంట్ పుప్పాల అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 సంవత్సరముల నుండి హోంగార్డుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన నారాయణస్వామి వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం హోంగార్డులను కేవలం స్వచ్ఛంద సేవా సంస్థ లాగానే చూస్తుండడం వల్ల పదవి విరమణ పొందిన హోంగార్డుల యొక్క కుటుంబాల వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందన్నారు. కాబట్టి గతంలోని ప్రభుత్వం హోంగార్డుల సమస్యలను పరిష్కరించకపోవడంతో అనేక పోరాటాలు చేశామని ఆయన గుర్తు చేశారు. అప్పటి పోరాటాలకు ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలబడి..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హోంగార్డుల సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చి..అండగా నిలబడ్డారన్నారు. గత ప్రభుత్వం హోంగార్డులను అణిచివేయడంతోనే కాంగ్రెస్ పార్టీని ప్రత్యామ్నాయంగా భావించామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి హోంగార్డ్ సమస్యలను పరిష్కరించేందుకు హోంగార్డ్ సంఘం నేతలతో సంప్రదించి చర్చలు జరిపి హోంగార్డులకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత కల్పించి హోంగార్డుల కుటుంబ జీవితాలలో వెలుగులు నింపాలని యావత్తు హోంగార్డుల సంఘం కుటుంబ సభ్యులు, హోంగార్డులు కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హోంగార్డుల ఇన్చార్జి..ఆర్ఎస్ఐ సురేందర్ రెడ్డి, ఏఎస్ఐ ప్రకాష్ గౌడ్, హోంగార్డుల సంఘం స్టేట్ నాయకులు కుమార్, చిర్ర రాజయ్య, రమేష్, హోంగార్డుల సంఘం జిల్లా ప్రెసిడెంట్ రావుల మొగిలి, హోంగార్డుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు ముత్యాల మొగిలి, మేడిపల్లి శ్రీను, బానోజు సీతారాం నాయక్, గంగరాజు, పెండెల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.