క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పోదాం వీరయ్య

క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పోదాం వీరయ్య
జ్ఞాన తెలంగాణ/ భద్రాద్రి /చర్ల మండల న్యూస్.జూన్ 13:
కాంగ్రెస్ పార్టీ టీ పీసీసీ ఉపాధ్యాక్షులు పొదెం వీరయ్య గారు చర్ల మండలంలోని సి. కత్తిగూడెం గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం కు ముఖ్య అతిధిగా హాజరయ్యారయ్యారు. విన్నర్స్ మామిడిగూడెం టీం కు మొదటి బహుమతి 30,000/- షీల్డ్ పొదేం వీరయ్య గారి చేతులమీదుగా ఇవ్వడం జరిగింది, రన్నర్స్ గా నిలిచిన సి. కొత్తూరు(గుట్టబోరు) యూత్ కు 20,000/-రూ. షీల్డ్,జడ్పీటీసీ ఇర్ప శాంత, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చీమలమర్రి మురళీకృష్ణ గారి చేతుల మీదుగా బహుమతి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు నల్లమల వెంకటేశ్వర్లు గారు,మండల అధ్యక్షులు ఆవుల విజయ భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీ మడకం పద్మజ,గుండేపూడి భాస్కర్ రావు గారు, సుందరి సురేష్, చీమకుర్తి సాయి చరణ్, తోటమళ్ళ వరప్రసాద్,ఇర్ప శ్రీనివాస రావు, ఆవుల పుల్లారావు, లింగాపురం మాజీ సర్పంచ్ సరియం రాధ, కాకర్ల కుమార్, తదితరులు పాల్గొన్నారు.