కార్మికుల సంక్షేమం కోసం పోరాడుతా:మాజీ ఎమ్మెల్యే దాస్యం

కార్మికుల సంక్షేమం కోసం పోరాడుతా:మాజీ ఎమ్మెల్యే దాస్యం
జ్ఞాన తెలంగాణ హనుమకొండ
కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పని చేస్తానని హనుమకొండ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ చీఫ్ చీప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. గురువారం నాడు హనుమకొండ బాలసముద్రంలోని బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయంలో హమాలి సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ… ప్రభుత్వంలో ఉన్న లేకున్నా సంఘటిత,అసంఘటిత కార్మికుల సంక్షేమ ధ్యేయంగా నిరంతరం పని చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం అధ్యక్షులు మరియు హమాలీలు పాల్గొన్నారు.