ఉభ చెరువు (మినీ ట్యాంక్ బండ్) కట్టను ధ్వంసం చేసి రోడ్డు వేసుకున్న వెంచర్ అనుమతులను వెంటనే రద్దు చేయాలి

ఉభ చెరువు (మినీ ట్యాంక్ బండ్) కట్టను ధ్వంసం చేసి రోడ్డు వేసుకున్న వెంచర్ అనుమతులను వెంటనే రద్దు చేయాలి
జ్ఞాన తెలంగాణ సదాశివపేట
సదాశివపేట మినీ ట్యాంక్ బండ్ (ఉభ చెరువు) ను రక్షించాలి.
రియల్ ఎస్టేట్ వ్యాపారులతో అధికారులు కుమ్మకు.
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్
కలెక్టరేట్ ఏవో పరమేశ్వర్ గారికి సిపిఎం వినతి
సదాశివపేట పట్టణంలోని ఉభ చెరువు (మినీ ట్యాంక్ బండ్) కట్టను ధ్వంసం చేసి రోడ్డు వేసిన వెంచర్ అనుమతులను వెంటనే రద్దు చేయాలని, ఉభ చెరువు (మినీ ట్యాంక్ బండ్) ను రక్షించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు..
కలెక్టరేట్ ఏవో పరమేశ్వర్ గారికి సిపిఎం నాయకులు వినతిపత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా అతిమేల మాణిక్ మాట్లాడుతూ ఉభ చెరువు 99 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నదని, చెరువు పట్టణానికి అనుకొని ఉండడంతో పట్టణ ప్రజలకు అల్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు సదుద్దేశంతో పట్టణ సుందరీకరణలో భాగంగా 5 కోట్ల నిధులు ఖర్చుపెట్టి చెరువు కట్టను మినీ ట్యాంక్ బండ్ గా నిర్మించారాని అన్నారు ప్రజలు ఉదయం సాయంత్రం వాకింగ్ చేస్తూంటారు.. అల్లాహతకరమైన వాతావరణం కోసం ప్రజల సాయంత్రం పూట మినీ ట్యాంక్ బండ్ పైకి వచ్చి స్వేద తీరుతున్నారు. పట్టణ ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడే ఉభ చెరువును కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమార్కులు ధ్వంసం చేశారన్నారు చెరువు పక్కనే ఉన్న ప్లాట్ల వెంచర్ కు అసలు రోడ్డు లేదు. కానీ ప్రభుత్వ అధికారులు వెంచర్ కు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.. ఎఫ్.టి.ఎల్ బఫర్ జోన్ లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టొద్దని అటువంటి వెంచర్లకు అనుమతులు ఇవ్వొద్దని నిబంధనలు ఉన్నా.. అవేవీ పట్టించుకోకుండా అక్రమంగా వెంచర్లు వేస్తున్నారు. వెంచర్ల యజమాను అధికారులు కొమ్మక్కై ఇస్తారాజంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. చెరువు కట్టను ధ్వంసం చేయడంతో చెరువులో నీళ్లు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు ఆయకట్ట రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు పెద్ద ఎత్తున పట్టణ ప్రజలకు, ఆయకట్టు రైతులకు నష్టం జరుగుతుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు
చెరువు ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ ప్రదేశం దురాక్రమణ గురికాకుండా చూడాలని
బంగారు మైసమ్మ గుడి ధ్వంసం చేసిన వెంచర్ యాజమాన్యం పై కఠిన చర్యలు చేపట్టాలని, వెంచర్ కు అక్రమంగా అనుమతులు ఇచ్చి వత్తాసు పడుతున్న అధికారులను సస్పెండ్ చేయాలని,ఉభ చెరువు కట్టను కాపాడాలని, అప్రోచ్ రోడ్డు లేనందున ఈ సంజీవని లేక్ సిటి వెంచర్ అనుమతులు ను రద్దు చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తుందని అన్నారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వం హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో సిపిఎం సదాశివపేట ఏ ఏరియా కమిటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ సిపిఎం నాయకులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.