నాణ్యమైన విద్యను అందిస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చదివించేందుకు

కోహెడ ఎంపిటిసి ఖమ్మం స్వరూపవేంకటేశం విజ్ఞప్తి చేసారు

జ్ఞాన తెలంగాణ
సిద్దిపేట జిల్లా
కోహెడ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఈరోజున జరిగిన బడిబాట కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు నోట్ బుక్కులు స్కూల్ యూనిఫామ్ లను అందజేసే కార్యక్రమానికి సభ అధ్యక్షత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ సార్ గారు వహించగా

ముఖ్యఅతిథిగా స్థానిక ఎంపిటిసి ఖమ్మం స్వరూపవేంకటేశం, విశిష్ట అతిథిగా ఆదర్శ పాఠశాల చైర్మన్ ముంజ మంజుల గార్లు హాజరై ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ స్కూల్ యూనిఫామ్ అందజేశారు

కోహెడ హైస్కూల్ లో టెన్త్ లో వందశాతం ఉత్తీర్ణత శాతం సాధించేలా కృషిచేసిన హెడ్మాస్టర్ మహమ్మద్ సార్ గారికి స్థానిక ఎంపిటిసి గారు శాలువతో సన్మానించి అభినందనలు తెలిపిన అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరు తీసుకొని ఎక్కువ సంఖ్యలో పిల్లలను చేర్పించాలని పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ స్కూల్ యూనిఫామ్ మద్యనబోజనం పెట్టి నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలు చేరి విద్యానభ్యసించాలని ఎంపిటిసి కోరారు

You may also like...

Translate »