పర్మిషన్ లేని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

విద్యాశాఖ అధికారి అసిస్టెంట్ ఆఫ్ డైరెక్టర్ ఫిర్యాదు

టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సవీందర్ చౌహన్

జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం)

పర్మిషన్ లేని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సవీందర్ చౌహన్ అన్నారు.సవీందర్ చౌహన్ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మహేశ్వరం నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే
నందు సుఖేషిని తోట
విద్యాశాఖ అధికారి అసిస్టెంట్ ఆఫ్ డైరెక్టర్ వారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలల పై మౌళిక వసతులను కల్పించని ప్రైవేట్ పాటశాల పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గంలో అనుమతులు లేకుండా ప్రైవేట్ పాఠశాలలు అడ్మిషన్ తీసుకుంటున్నాయని దీనికి నిదర్శనం మహేశ్వరం మండల కేంద్రంలో ఉన్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్ కి ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండానే నర్సరీ టూ టెన్త్ క్లాస్ వరకు అడ్మిషన్ లు తీసుకుంటున్నారు.తుక్కుగూడ లో శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం అధికంగా ఫీజు వసూలు చేస్తుంది.టెస్ట్ పుస్తకాలుకు ఒక్కొక్క విద్యార్థి నుంచి 6 వేల నుంచి10 వేల రూపాయలు తీసుకుంటున్నారు.టెస్ట్ బుక్స్ స్కూల్ మేనేజ్ మెంట్ అనుసంధానం లోనే నడుస్తున్నాయి.వీటిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని
అలాగే మహేశ్వరం నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయి విద్యా చెపుతామంటు తల్లిదండ్రుల నుండి లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. మహేశ్వరం మండలం మొహబ్బాత్ నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలో భాష్యం బ్లమ్స్ స్కూల్ , కందుకూర్ మండలం లేమూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ని మంచిస్టర్ గ్లోబల్ స్కూల్ మానేజ్మెంట్ నర్సరీ చదివే విద్యార్థికి సుమారు 4 లక్షల రూపాయలు ఫీజ్ తల్లిదండ్రుల నుండి వసూలు చేస్తున్నారు. అలాగే ప్రైవేట్ స్కూల్ యజమాన్యం వారు విద్యార్థులకు కావలసిన టెక్స్ట్ బుక్స్ మరియు యూనిఫామ్ డ్రెస్ మా పాఠశాలలోనే ఉన్నాయని తల్లిదండ్రులకు చెపుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు. బి ఈడి, టెట్ క్వాలిఫైడ్ కానీ టీచర్ల తో బోధన చేపిస్తున్నారు. ప్లే గ్రౌండ్, పార్కింగ్ ప్లేస్, పిట్ నెస్ లేని బస్సులు నడిపే యజమాన్యం పై చర్యలు తీసుకోవాలని కోరారు.

You may also like...

Translate »