ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన హరీష్ రావు

జ్ఞాన తెలంగాణ సిద్దిపేట:

పేదోళ్ల సౌలతుల కోసమే సర్కారు దవాఖానా.
మాజీ మంత్రి హరీష్ రావు గారు

సిద్దిపేట సర్వజన ఆసుపత్రిని మాజీ మంత్రి హరీశ్ రావు గారుఆకస్మికగా సందర్శించారు.రోగులను వారి బంధువులను ఆత్మీయంగా పలకరిస్తూ, హాస్పిటల్ సూపరింటెండెంట్, ఆర్ఎమ్‌ఓ, ఇతర వైద్యులు, సిబ్బందితో కలసి అన్ని విభాగాలను తనిఖీ చేశారు.

కార్పొరేట్ వైద్యానికి దీటుగా నాణ్యమైన వైద్య సేవలకు పెట్టింది పేరైన సిద్దిపేట ప్రభుత్వాస్పత్రి ఇకపైనా మెరుగైన సేవలు అందించాలని ఆయన కోరారు.

ఆస్పత్రిలో అందిస్తున్న వివిధ వైద్య సేవల గురించి ఆయన ఆరా తీశారు. వైద్యులతో, పేషంట్లతో, వారి బంధువులతో ముచ్చటించారు.

గర్భిణులతో మాట్లాడి, వారికి సరైన వైద్యపరీక్షలు అందుతున్నాయా, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారా అని కనుక్కున్నారు. ఇన్ పేషంట్లకు, డెలివరీ అయిన మహిళలకు డైట్ మెనూ సరిగ్గా అందుతున్నదా, అటెండెంట్లకు కూడా భోజనం పెడుతున్నారా అని ఆరా తీశారు. పౌష్టిక భోజనం, పాలు, గుడ్లను అందించాలని, రోగులకు అందించే భోజనంపై నిర్లక్ష్యం లేకుండా చూడాలని సూపరింటెండెంట్‌ను కోరారు.

ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని, ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని వైద్యులు పేషంట్లకు మరింత అవగాహన కల్పించాలని హరీష్ రావు సూచించారు.

ఫార్మసీ విభాగాన్ని సందర్శించి పేషంట్లకు మందులు సరిగ్గా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. స్టాక్ లేని మందులను ప్రభుత్వాన్ని అడిగి తెప్పించాలని, రోగులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఖర్చులు భరించలేకే ప్రజలు ఇక్కడికి వస్తుంటారని, వారికి మెరుగైన వైద్యం అందుతుందనే భరోసా కల్పించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో మందులు వైద్య పరీక్షలువైద్య పరీక్షల కోసం గోగులను బయటకు పంపించవద్దని సూపరిండెంట్ ను ఆదేశించారు.

ఆస్పత్రికి అనుబంధంగా మెడికల్ కాలేజీ ఉంది కాబట్టి మరింత మెరుగైన వైద్యం 24 గంటలు
అందుతుందన్నారు. ఆయా విభాగాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎమర్జెన్సీ సేవలను మరింత పటిష్టపరచాలని సూచించారు.

అదేవిధంగా మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులు, డాక్టర్లు, అధ్యాపకుల సమస్యలను హరీశ్ రావు అడిగి తెలుసుకున్నారు.

ల్యాబ్ టెస్టులు, మందుల వివరాలను మాజీ మంత్రి ఆరా తీశారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి వైద్యులను, సిబ్బందిని హరీశ్ రావు గారు కోరారు.

You may also like...

Translate »