సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్.

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్.
జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిధి జూన్ 12.
ముందస్తు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని. అడిషనల్ కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.
వానాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులపైన ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రజలకు వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండాలని, గ్రామాలు, పట్టణాలలో పగడ్బందీగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, త్రాగునీటి ట్యాంకులను శుభ్రపరిచి క్లోరినేషన్ చేయాలని, త్రాగునీటి పైపులైన్లు లీకేజ్ కాకుండా చూడాలని, వర్షపు నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలన్నారు.
ఫ్రైడే డ్రై డే నిర్వహించాలని ఇంటి పరిసరాలు, ఆస్పత్రులు, హోటల్లు, పాఠశాలలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపార దుకాణాల పరిసరాలలో చెత్త చెదారం వేయకుండా చూడాలని, ఈ అంశాలపై మున్సిపల్, మండలం, గ్రామ స్థాయిలలో అధికారులతో సమావేశం నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ గరీమ అగ్రవాల్ వైద్యాధికారుల సిబ్బంది. సంబంధిత శాఖల అధికారులకు జూమ్ మీటింగ్ ద్వార సూచించారు.
వర్షా కాలంలో నీటి కలుషితము కావడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని, అందుకుగాను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు శుభ్రమైన మంచి నీటిని ప్రజలకు అందించే విధంగా చూడాలని, కలుషితమైన నీరు తాగడం వల్ల వచ్చే అతిసార వ్యాధి నీళ్ల విరోచనాలు పచ్చకామెర్లు, గ్యాస్ట్రోయిన్ట్రైటీస్ మొదలగు వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందన్నారు.
అదేవిధంగా మురికి కాలువల్లో మురికి నీటిలో క్రిమి సమారక మందులను పిచికారి చేయించాలని ఆంటీ లార్వా ఆంటీ అడల్ట్ మేజర్స్ పాటించాలని, సూచించారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి, జ్వర పీడితులకు తక్షణమే రక్త నమూనాలు స్వీకరించి చికిత్స అందించి, ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు,
గ్రామాల్లో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వెంటనే స్పందించి అవసరమున్న చోట మెడికల్ క్యాంపులను నిర్వహించి వారికి చికిత్సలు అందించాలని, ముఖ్యంగా కీటక జనిత వ్యాధుల వల్ల మలేరియా, చికెన్ గున్యా, మెదడు వాపు ఫైలేరియా, డెంగ్యూ, మొదలగు వ్యాధులు వ్యాపించడం జరుగుతుందని కావున ఆరోగ్య సిబ్బంది ప్రజల్లో కీటక జనత, కలుషిత నీరు త్రాగడం వల్ల ఆహార కలుషితం, కుళ్ళిపోయిన ఆహారం తీసుకోవడంలో వచ్చే వ్యాధుల పైన ప్రజల్లో శుభ్రమైన నీటిని త్రాగాలని బోరు పంపు నీరును తాగాలని కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని, వేడి వేడి ఆహార పదార్థాలను తీసుకోవాలని, ఈగలు దోమలు వాలిన ఆహార పదార్థాలను తీసుకోకుండా చూడాలన్నారు.
వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని పరిసరాల పరిశుభ్రతను పాటించాలని అన్ని గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తద్వారా సీజనల్ వ్యాధుల వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ప్రజల్ని కాపాడవచ్చు అని ఆదేశించారు. ప్రజలు దోమలు కుట్ట కుండ కుట్టకుండ, తగు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిపిఓ దేవకీదేవి, జెడ్పీ సీఈవో రమేష్, ఎస్ఇఆర్డబ్ల్యు శ్రీనివాస చారి, మునిసిపల్ కమిషనర్లు, డిప్యూటీ డిఎంహెచ్వోలు. డాక్టర్ కాశీనాథ్, డాక్టర్ శ్రీనివాస్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, డాక్టర్ విజయ రాణి, డాక్టర్ రజిని ఎంపీడీవోలు, వైద్యాధికారులు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
