విద్య ప్రమాణాలతోనే పిల్లలకు బంగారు భవిష్యత్తు

బడిబాట కార్యక్రమంలో ఏకరూప దుస్తులు పుస్తకాలు పంపిణీ

నేను కుడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్ననంటూ బాల్వంత్ రెడ్డి స్పష్టికరణ

హాజరైన మాజీ కాంగ్రెస్-పార్టీ అధ్యక్షులు సోలిపురం భల్వంత్ రెడ్డి సాయిరెడ్డి మల్లేష్ మంగమ్మ తదితరులు

జ్ఞాన తెలంగాణ చేవెళ్ల జూన్ 12

చేవెళ్ల మండలం కందవాడ గ్రామంలో ఈ రోజు పాఠశాల పునః ప్రారంభ కార్యక్రమంలో
సోలిపురం బాల్వంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో నాలుగు గ్రామాల నుండి విద్యార్థులు ఐదారు కిలోమీటర్లు నడుచుకుంటూ పాఠశాలలకు వచ్చి చదువుకునేవారని ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందిందని విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఇంతటి వాడినయ్యానని గర్వంగా చెప్పారు.
పాఠశాల అభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.

మల్లేష్ మాట్లాడుతూ
విద్య ప్రమాణాలతోనే బంగారు భవిష్యత్తు పిల్లలకు లభిస్తుందని నేను ఇదే పాఠశాలలో చదువుకున్నానని పాత రోజులు గుర్తు చేసుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్య ప్రమాణాలు ప్రైవేటులో కూడా ఉండవని పేర్కొన్నారు. మంచి అధ్యాపకులు, ఉత్తమ బోధన రెండు లభిస్తాయని అన్నారు.

శేరి సాయిరెడ్డి మాట్లాడుతూ
విద్య కోసం తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో సహకరించాలని ఒక ఉపాధ్యాయుల పైన భారం పెడితే సరిపోదని తల్లిదండ్రులు కూడా శ్రద్ధ వహించాలని తెలిపారు

ప్రధానోపాధ్యాయురాలు లోవ లక్ష్మి మాట్లాడుతూ
ఆడపిల్లలకు చదువును ఆపొద్దు పదవ తరగతి చదివాక ఆడపిల్లలకు చదువులు ఎందుకని వివాహానికి తొందర పెడుతుంటారని దయచేసి తల్లిదండ్రులు అలాంటి నిర్ణయాలు వెంటనే మార్చుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు హితవు పలికారు. పదవ తరగతి అయిపోగానే, పై చదువులు ఎందుకని? చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లలకు విద్యను దూరం చేస్తున్నారని వివాహాల పేరిట వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ఇకపై అలాంటి తల్లిదండ్రులు వారి నిర్ణయాలు మార్చుకుని పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని సూచించారు. సమాజంలో ఆడపిల్ల చదువుకున్నప్పుడే ఒక కుటుంబాన్ని ఆ తర్వాత గ్రామాన్ని ఆ తర్వాత ప్రాంతాన్ని శ్రద్ధగా అభివృద్ధి చేస్తుందని మహిళల వల్లే ఆర్థిక స్వాలంబన, సమాజ శ్రేయస్సు ఉంటుందని చెప్పారుఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది గ్రామ పెద్దలు పాల్గొన్నారు

You may also like...

Translate »